»   » మన "ముద్దు" చూసి మీ ఆయన ఏమంటాడు? అని అడిగాడు: ఇమ్రాన్ పరువు తీసేసిన విధ్యా బాలన్

మన "ముద్దు" చూసి మీ ఆయన ఏమంటాడు? అని అడిగాడు: ఇమ్రాన్ పరువు తీసేసిన విధ్యా బాలన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ మొత్తం లోనూ ముక్కుకు మరీ సూటిగా మాట్లాడేవాళ్ళలో విధ్యాబాలన్ కూడా ఉంటుంది. ఒక్కోసారి విధ్యామాట్లాడేమాటలు కొందరిని మరీ ఇబ్బంది పెట్టిన సందర్బాలూ ఉన్నాయి. తెరమీద ఎంత బోల్డ్ గా కనిపిస్తుందో తెరబయట కూడా అంతే బోల్డంత బోల్డుగానే ఉంటుందీ అందాల భామ. చీరకట్టులో ఎంతగా నటించిందో "చీ పాడు" అనుకునే సీన్లలో కూడా అంతే బాగా నటించి చూపించిన విధ్యా ఈ మధ్య ఒక ముద్దు సీన్ వ్యవహారం లో అంతే ముద్దుగానూ, కొంత ఘాటుగానూ తన అభిప్రాయాన్ని చెప్పి అందర్నీ ఇంకోసారి ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇమ్రాన్ హష్మితో

ఇమ్రాన్ హష్మితో

"ఘన్‌చక్కర్‌" చిత్రంలో ఇమ్రాన్ హష్మితో కలిసి చేసిన ఒక ముద్దు సన్నివేశాన్ని గుర్తు చేసుకున్న ఆమె, ఆ సీన్ చేసే ముందు ఇమ్రాన్ అన్న మాటలు మరీ కామెడీగా అనిపించాయంటూ ఇలా చెప్పింది. . ‘ఈ సీన్ చేశాక సిద్ధార్థ్‌ (విద్యా బాలన్ భర్త) ఏం అంటాడని అనుకుంటున్నావ్‌?' అనడిగాడు తను.

"VidyaVox" : YouTube Page Got 90 Million Views - Filmibeat Telugu
 ఇలాగే మాట్లాడుతుంటావా?

ఇలాగే మాట్లాడుతుంటావా?

వెంటనే నేను ‘ఇది నా చివరి చెక్‌ అవుతుందని అనుకుంటున్నావా? నేను సినిమాలు ఆపేస్తాననుకుంటున్నావా? ఇలాంటి సీన్ చేసిన ప్రతిసారీ ఇలాగే ఎదుటివాళ్లతో మాట్లాడుతుంటావా?' అన్నాను'' అని తెలిపింది. దటీజ్ విధ్యా..! అయినా అంతకన్నా హాట్ సీన్లలోనే నటించిన విధ్యా తన భర్త సహకారం లేకుండానే చేసి ఉంటుందా!? తనతో ముద్దు సీన్ చేసినందుకే ఇమ్రాన్ ఇలా అడిగి విధ్యా ఇచ్చిన షాక్ కి అవాక్కయ్యాడు.

 స్తీని ముద్దు పెట్టుకోవాల్సివస్తే

స్తీని ముద్దు పెట్టుకోవాల్సివస్తే

సరే ఈ విషయం పక్కనపెట్టి ఒక వేళ మగాళ్ళకి బదులుగా ఒక స్తీని ముద్దు పెట్టుకోవాల్సివస్తే అదీ లిప్ లాక్ చేయాల్సి వస్తే ఇలాగే చేస్తారా? అని అడిగితే తడుముకోకుండా విద్య చెప్పిన జవాబు ఇదీ " ఎందుకు పెట్టుకోను? ముద్దు పెట్టుకుంటాను., అది నా సహజ స్వభావం కాకపోవచ్చు. కానీ ఒక పాత్ర కోసం ఆ పని చేస్తాను.

వాళ్ళు అయితే బాగుంటుంది

వాళ్ళు అయితే బాగుంటుంది

అవతలి వాళ్లు పెనలోప్‌ క్రజ్‌ లేదా సల్మా హయక్‌ లేదా ఎమ్మా స్టోన్ అయితే బాగుంటుంది." అంటూ చెప్పి తన ఫ్రొఫెషన్ మీద తన అభిప్రాయం ఏమిటో చెప్పేసింది. నేహా ధూపియాతో కలిసి ఆమె నటిస్తోన్న ‘తుమ్హారీ సులు' నవంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

English summary
Emran Hashmi kept telling me – so what do you think Siddharth’s going to say after watching the scene? You think I’ll get my last cheque? And I’d be like why? He’s like, after Siddharth watches this and I’d be like why do you have to do this before every take.” says Vidhya Balan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu