»   » సూర్య, జ్యోతికల సినిమా: సెప్టెంబర్ 15 న రిలీజ్

సూర్య, జ్యోతికల సినిమా: సెప్టెంబర్ 15 న రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెళ్ళి చేసుకున్నాక సిల్వర్ స్క్రీన్ కు దూరమైన జ్యోతిక '36 వయదినిలే' సినిమా ద్వారా కోలీవుడ్‌లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చింది. అన్ని సంవ్వత్సరాల తర్వాత వచ్చిన సినిమా అయినా యావరేజ్ గా నిలబెట్టి రీఎంట్రీతో మరోసారి సత్తా చాటిన ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ తాజాగా 'మగళీర్‌ మట్టుం' చిత్రంలో నటిస్తోంది..

Gallery : Jyothika In Magalir Mattum

సూర్యనే నిర్మిస్తున్నాడు

సూర్యనే నిర్మిస్తున్నాడు

ఈ సినిమాను ఆమె భర్త సూర్యనే తమ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. మహిళా ప్రాధాన్యత కలిగిన ఈ సినిమాను కుట్రం కడిదల్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన బ్రహ్మ కథ, దర్శకత్వం వహించారు. ఈ మూవీలో జ్యోతిక మహిళలకు స్ఫూర్తిదాయకమైన పాత్రను పోషిస్తున్నట్లు కోలీవుడ్ సమాచారం.

మగళీర్‌ మట్టుం

మగళీర్‌ మట్టుం

‘మగళీర్‌ మట్టుం' సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రెండు పోస్టర్లను విడుదల చేశారు. జ్యోతికతో పాటూ శరణ్య పొన్‌వన్నన్‌, భానుప్రియ, ఈర్వశిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నాజర్‌, లివింగ్‌స్టన్‌ కూడా కీలక రోల్స్ లో కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తైపోయిందట.

జ్యోతిక డబ్బింగ్

జ్యోతిక డబ్బింగ్

దీంతో డబ్బింగ్‌ పనులు ఆరంభమయ్యాయి. జ్యోతిక తన పార్ట్ డబ్బింగ్ పూర్తి చేసిందని చిత్రబృందం తెలిపింది. ఆమె తన పాత్రలకు డబ్బింగ్ చెప్పుకోవడం ఇది రెండో సారి మాత్రమే అట. గతంలో ‘మాయావి' చిత్రానికి తొలిసారి డబ్బింగ్‌ చెప్పిన జ్యోతిక మళ్లీ ‘మగళీర్‌ మట్టుం'కే గాత్రం ఇచ్చింది.

సెప్టెంబర్‌ 15న

సెప్టెంబర్‌ 15న

జూలైలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉన్నా, అనివార్యకారణాలతో ఆలస్యమైంది. దీంతో చిత్రాన్ని సెప్టెంబర్‌ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం తరువాత సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై తన తమ్ముడు కార్తీ హీరోగా పాండిరాజ్‌ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు.

English summary
Magalir Mattum is all set to hit the screens on 15 September. Jyothika plays a documentary filmmaker in the film directed by Bramma of Kuttram Kadithal fame
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu