»   » సమీర్ వెన్నుపోటుదారుడు.. మీరు చూసే బిగ్‌‌బాస్ వేరు.. నన్ను కేసులో ఇరికించారు.. జ్యోతి

సమీర్ వెన్నుపోటుదారుడు.. మీరు చూసే బిగ్‌‌బాస్ వేరు.. నన్ను కేసులో ఇరికించారు.. జ్యోతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న తారల్లో జ్యోతి ఒకరు. తనకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని బిగ్‌బాస్ నిర్వాహకులు ఆ కార్యక్రమానికి జ్యోతిని ఎంపిక చేశారు. అయితే తొలివారమే బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కావడం బుల్లితెర వీక్షకులను షాక్ గురిచేసింది. బిగ్‌బాస్ హౌస్‌లోని అనేక విషయాలతోపాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా ఆమె వెల్లడించారు.

 అందుకే ఎలిమినేట్ చేశారేమో...

అందుకే ఎలిమినేట్ చేశారేమో...

నేను ఒకరికి అణిగిమణిగి ఉండే క్యారెక్టర్ కాదు. మీరు బిగ్‌బాస్‌లో చూసే ఉండి ఉంటారు. ఈ అమ్మాయి ఏ మాట వినదు. ఎవరి మాట వినదు. అందుకే నన్ను ఎలిమినేట్ చేసి ఉంటారమో. నేను టైటిల్ ఫేవరేట్ అవుతాననే ఉద్దేశంతో ఇంటి సభ్యులు నన్ను ఎలిమినేట్‌కు నామినేట్ చేసి ఉంటారేమో. నన్ను కావాలనే కార్నర్ చేశారు. నేను పోటీలో ఉంటే తట్టుకోవడం కష్టమని భావించారేమో. అందుకే నాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అలాంటి వాతావారణంలో ఉండలేకపోవడం మంచిదే అనుకొన్నాను అందుకే బయటకు వచ్చినా బాధ కలుగలేదు అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

Bigg Boss Telugu : Bigg Boss given Warning to Contestants
లోపల కనిపించేది వేరు..

లోపల కనిపించేది వేరు..

బయటకు కనిపించే బిగ్‌బాస్ వేరు. లోపల జరిగే బిగ్‌బాస్ వేరు. చాలా కొంత మేరకే ఫుటేజ్‌లు చూపిస్తున్నారు. మేము లోపల చాలా చేశాం. చాలా ఆటలు ఆడాం. అవన్నీ ఎవరికీ తెలియదు. బయటకు చూపించడం లేదు. కొన్ని కాంట్రవర్షియల్ పాయింట్సే చూపిస్తున్నారు అని వెల్లడించారు.

ముమైత్ గొడవ జరిగింది..

ముమైత్ గొడవ జరిగింది..

బిగ్‌బాస్‌లో ముమైత్‌తో జరిగిన గొడవ అవగాహనలోపంతో జరిగింది. నేను ఆమెకు సర్ధి చెప్పడానికి ప్రయత్నించాను. కానీ ఆమె అర్థం చేసుకోలేదు అని జ్యోతి చెప్పింది. హౌస్‌లో చాలా జరుగుతున్నాయి. మైండ్ గేమ్స్ చాలా జరుగుతున్నాయి. సమీర్ ఓ బ్యాడ్ బుచ్చర్ అని జ్యోతి వెల్లడించింది అని ఆమె చెప్పింది

 నన్ను పొగరుబోతుగా చూస్తారు..

నన్ను పొగరుబోతుగా చూస్తారు..

బోల్డ్‌గా ఉండటం వల్ల తనను పొగరుబోతుగా చూస్తారు. నా మీద అనేక రకాలుగా మాట్లాడుకొన్నారు. సినిమాల్లో ఏడుపు సీన్లు వస్తే మిగితా వారిని చూసి నవ్వుకునే దానిని. ఆ తర్వాత ఓ బిడ్డకు తల్లిగా మారిన తర్వాత నా ప్రవర్తన మారిపోయింది. అందుకే బిగ్‌బాస్‌కు వెళ్లే సమయంలో మంచి మదర్‌ను అని చెప్పాను అని జ్యోతి పేర్కొన్నారు.

దుబాయ్‌లో ప్రపోజ్ చేశారు. .

దుబాయ్‌లో ప్రపోజ్ చేశారు. .

నేను ఓ షోలో పాల్గొనడానికి దుబాయ్‌కి వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి నాకు ప్రపోజ్ చేశాడు. నాకు ఆ సమయంలో తోడు చాలా అవసరం. దాంతో పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాం. పెళ్లి తర్వాత కుమారుడు పుట్టాడు. అప్పుడు మా మధ్యలో గొడవలు జరిగాయి. అలా విడిపోయి హైదరాబాద్ వచ్చాను. నేను షూటింగ్ నుంచి అర్థరాత్రి సమయంలో ఇంటికి వచ్చే సమయానికి నాలుగేళ్ల నా కొడుకు ఇంట్లో భయపడుతూ ఉండేవాడు. ఆ సన్నివేశాలు చూసి నేను ఏడ్చాను అని ఆమె చెప్పారు.

 కష్టాలు పడుతున్న సమయంలో..

కష్టాలు పడుతున్న సమయంలో..

వైవాహిక జీవితంలో కష్టాలు పడుతున్న సమయంలో నన్ను కావాలనే కేసులో ఇరికించారు. ఆ సమమంలో నాకు తోడుగా ఎవరూ లేరు. ఆ కేసులో నేను ఇరుక్కున్నాక నా తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారం తర్వాత నా తండ్రి ఆకస్మికంగా మరణించారు అని జ్యోతి కన్నీటిపర్యంతం అయ్యారు.

English summary
Telugu Version of Bigboss started with High Energy. House filled with emotions. Jyothy was first eliminated contest. She speaks with a media channel recently. And Reveals so many things to media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu