»   » టాలీవుడ్ నిర్మాతకు బెదిరింపులు: వచ్చి సెటిల్ చేస్కో లేదంటే చంపేస్తాం అంటూ

టాలీవుడ్ నిర్మాతకు బెదిరింపులు: వచ్చి సెటిల్ చేస్కో లేదంటే చంపేస్తాం అంటూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

డబ్బులకోసం టాలీవుడ్ నిర్మాతని బెదిరించారు గుర్తు తెలియని వ్యక్తులు, అదీ "సెటిల్" చేసుకొమ్మనీ లేదంటే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని టాలీవుడ్ నిర్మాత కే ఎల్ ప్రసాద్ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

జర్నలిస్టు కాలనీలో నివాసముండే సినీ నిర్మాత కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌కు శనివారం మధ్యాహ్నం ఓ నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఆయన పనిలో ఉండి లేపలేదు. గంట తర్వాత మరో రెండు సార్లు ఫోన్‌ వచ్చింది. దీంతో దామోదర్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేయగా అవతలి వైపు నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఇష్టం వచ్చినట్టు తిడుతూ మాట్లాడాడు.

K L Damodar Prasad Telugu Movie Producer

ఎవరు మీరు.. అని దామోదర్‌ ప్రసాద్‌ అడిగినా వినిపించుకోకుండా అవతలి వ్యక్తి గట్టిగా కేకలు పెడుతూ తిట్టాడు. తెలంగాణ ఫిలిం చాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ తనకు డబ్బులు ఇవ్వాలని, అతను నీకు కూడా మితృడే కాబట్టి మ్యాటర్‌ను వెంటనే వచ్చి సెటిల్‌ చేసుకోవాలని లేదంటే చంపేస్తామని బెదిరించి ఫోన్‌ పెట్టేశాడు.

దీంతో దామోదర్‌ ప్రసాద్‌ తనకు గుర్తు తెలియని వ్యక్తి వల్ల ప్రాణభయం ఉందని బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రతాని రామకృష్ణగౌడ్‌ తనకు ఫిలించాంబర్‌ అధ్యక్షుడిగా మాత్రమే తెలుసునని ఆయనతో ఎలాంటి వ్యాపారం చేయలేదని తెలిపారు. ఫోన్‌లో దూషణలకు దిగిన వారిని పట్టుకొని శిక్షించాలని కోరారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దామోదర్‌ప్రసాద్‌కు వచ్చి ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

English summary
K L Damodar Prasad Telugu Movie Producer complained in Banjarahills police station about a threatening call
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu