»   » రాఘవేంద్రరావుతో మరో సినిమా: స్పందించిన నాగార్జున

రాఘవేంద్రరావుతో మరో సినిమా: స్పందించిన నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్ అనగానే తెలుగు ప్రేక్షకులు అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడిసాయి లాంటి భక్తిరస చిత్రాలు గుర్తుకొస్తాయి. తాజాగా వీరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వార్తలపై నాగార్జున స్పందించారు. ‘ఇటీవలే రాఘవేంద్రరావుగారు నాకు ఓ కథ చెప్పారు. కథ,కథనం హత్తుకునే విధంగా ఉంది. నేను నటించేందుకు సిద్ధమని చెప్పాను' అని తెలిపారు. సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను అని నాగార్జున స్పష్టం చేసారు.

K Raghavendra Rao to direct Nagarjuna

ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం బట్టి ఆయన 'ఏడు కొండలవాడు' అనే టైటిల్ తో ఓ భక్తిరస ప్రధాన చిత్రం కమిటయ్యారని సమచారం. గతంలో నాగార్జునతో షిర్డీ సాయి చిత్రం నిర్మించిన మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇలాంటి చిత్రాల రచనలో అందె వేసేన చెయ్యి అయిన భారవి సైతం ఈ ప్రాజెక్టుకు పనిచేస్తున్నట్లు సమాచారం. ఏప్రియల్ నుంచిషూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. ఇందులో వెంకటేశ్వరస్వామిగానే నాగార్జున కనిపిస్తారని వెంకటేశ్వర మహత్యం చిత్రం తరహా పౌరాణిక గాధ అని వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజముందనేది ప్రాజెక్టు ఫైనలైజ్ అయ్యి అధికారిక ప్రకటన వచ్చాకే తెలుస్తుంది.

ప్రస్తుతం నాగార్జున చేస్తున్న చిత్రం విషయానికి వస్తే... నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా'. లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ కధానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలో బ్రదర్' తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.
ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో హాట్ హీరోయిన్ హంసా నందిని నటిస్తుంది.

English summary
Nagarjuna could be working with veteran director K Raghavendra Rao again very soon. Recently the septuagenarian filmmaker met Nag and narrated a plot line. Confirming the same Nagarjuna said, "Yes, Raghavendra Rao garu said that he readied a new script for me. I was pretty excited and shall listen to the final script in a couple of weeks' time."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu