»   » మరీ ఇన్ని రూల్సా..!? నాగార్జున కీ తప్పని నిబందనలు

మరీ ఇన్ని రూల్సా..!? నాగార్జున కీ తప్పని నిబందనలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రాజమౌళి చిత్రాల షూటింగ్ సమయంలో కొన్ని రూల్స్ పెడుతూంటారు. విజువల్స్ ఏమీ బయిటకు వెళ్లకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన గురువు కె.రాఘవేంద్రరావు సైతం అదే రూటులో వెళ్తున్నారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ ఓ దైవకార్యంలా భావించి, సెట్ లోనూ అత్యంత భక్తి భావంతో మెలుగుతూ తన టీమ్ ని సైతం అదే దారిలో నడవమంటున్నారు.

అద్భుతమైన చిత్రాలను తెరకెక్కిస్తూ దర్శకేంద్రుడిగా పేరుపొందిన కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస చిత్రం 'ఓం నమోవెంకటేశాయ'. ఈ చిత్రం షూటింగ్‌ శనివారం ప్రారంభమైంది. వెంకటేశ్వరస్వామి గుడి సెట్ వేసి, అక్కడ షూటింగ్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఈ టీమ్ లోకి అనుష్క సైతం వచ్చి చేరింది. ఈ విషయమై రాఘవేంద్రరావు గారు స్వయంగా ఫేస్ బుక్ లో షేర్ చేస్తూ అనుష్క నటన గురించి చెప్పుకొచ్చారు.

ఆధ్యాత్మిక చిత్రాల్ని కె.రాఘవేంద్రరావు ఎంతో నిష్టతో యజ్ఞంలా భావించి తెరకెక్కిస్తుంటారు. 'ఓం నమో వెంకటేశాయ' కోసం అంతే శ్రద్ధతో రంగంలోకి దిగారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని రూల్స్ అప్లై చేస్తున్నారు. యూనిట్లో ప్రతీ మెంబర్ ఈ రూల్స్ ని తప్పనిసరిగా పాటించాలని తెలసింది. ఆ రూల్స్ ని మీకు ఇక్కడ అందిస్తున్నాం.

స్లైడ్ షోలో ఆ రూల్స్ ని చూడండి

చెప్పులు బయిటే

చెప్పులు బయిటే

ప్రతీ ఒక్కరూ తమ చెప్పులు బయిట వదిలేసి సెట్ లోకి రావాలి

సెల్స్ ఫోన్స్

సెల్స్ ఫోన్స్

సెట్ లోకి సెల్ ఫోన్స్ ఎలౌ చెయ్యటం లేదు

బొట్టు కంపల్సరీ..

బొట్టు కంపల్సరీ..

యూనిట్ లో ప్రతీ ఒక్కరు 'నామాలు లేదా నుదుట బొట్టు ' పెట్టుకుని రావాలి

కుర్తా

కుర్తా

ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కుర్తా ధరించాలి

గోవింద

గోవింద

ఏదైనా మాట్లాడే ముందు, మొదట గోవింద అని పలికి ఆ తర్వాతే సంభాషణ ప్రారంభించాలి.

గుర్తుకొస్తాయి

గుర్తుకొస్తాయి

నాగార్జున, కె.రాఘవేంద్రరావు కలయిక అనగానే 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' లాంటి భక్తి ప్రధానమైన చిత్రాలే గుర్తుకొస్తాయి. ఇకపై ఆ జాబితాలోకి 'ఓం నమో వెంకటేశాయ' కూడా చేరనుంది.

హాధీరాం బాబా

హాధీరాం బాబా

నాగార్జున హథీరాం బాబా పాత్రలో నటిస్తున్న చిత్రమది. గతంలో వెంకటేశ్వరస్వామి భక్తుడు అన్మమయ్యగా మెప్పించారు.

ఎప్పటిలాగే

ఎప్పటిలాగే

రాఘవేంద్రరావుకి రెగ్యులర్ టీమ్ ని గుర్తు చేస్తూ ఎప్పటిలాగే.. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

కంచె హీరోయిన్

కంచె హీరోయిన్

ప్రగ్యా జైశ్వాల్‌ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం.

అనుష్క ..

అనుష్క ..

ఇందులో ఓ కీలక పాత్ర కోసం అనుష్కని ఎంపిక చేసుకొన్నారు. అలాగని అనుష్క నాగార్జునకి జంటగా నటించడం లేదు. ఇందులో ఆమెది ఓ భక్తురాలి పాత్ర అని కె.రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ఆమె కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే తొలిసారి.

English summary
Regular shoot of Nagarjuan's 'Om Namo Venkatesaya' began on July 2nd. Currently, The unit is shooting at a Temple set erected in Annapurna 7 acres. K Raghavendra Rao listed out a set of rules to be followed by everyone visiting the set of 'Om Namo Venkatesaya'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu