»   » 'ప్రస్దానం' చిత్రంపై రాఘవేంద్రరావు కుమారుడు స్పందన

'ప్రస్దానం' చిత్రంపై రాఘవేంద్రరావు కుమారుడు స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ప్రస్దానం' చిత్రం చాలా బాగుంది. ఇంటిలెజెంట్ స్క్రిప్టులతో ప్రెష్ టాలెంట్ చాలా మంది వస్తున్నారు. అలాగే చాలా మంది ఆర్టిస్టులు దేవకట్టా దర్శకత్వంలో చేయాలని అనుకోవటం విన్నాను. కాబట్టి దేవకట్టా..యు.ఎస్ ని వదిలి వచ్చి సినిమాలు చేస్తారమో అంటున్నారు దర్శకుడు కె. సూర్య ప్రకాష్. తన చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న సూర్య ప్రకాష్ రీసెంట్ గా ప్రస్ధానం చూసి ఈ విధంగా స్పందించారు. కె.రాఘవేంద్రరావు కుమారుడైన సూర్య ప్రకాష్...సిద్దార్ధ, శృతి హాసన్ లతో ఫాంటసీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ఫాంటసీ ఫిలింకు యోధా అనే టైటిల్ పెట్టే అవకాశమున్నట్లు సమచారం. కె.రాఘవేంద్రరావు సమర్పణలో వాల్ట్ డిస్నీ (ఇండియా) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

అంగరాజ్యంలో కన్నీటు బొట్టు ఆకారంలో ఉండే ఓ కాల్పనిక గ్రామంలో ఈ జానపద కథ జరుగుతుంది. క్షుద్రశక్తులతో అంగరాజ్యాన్ని నాశనం చేయాలని రాక్షస మహారాణి అనుకుంటుంది. ఆమె బారిన పడిన తొమ్మిదేళ్ళ పాపను కాపాడటానికి ఒక వీరుడు బయలుదేరతాడు. అతడి ప్రేయసి జిప్పీ వనిత. ఆఖరి పోరాటంలో విజయం ఎవరిని వరించిందన్న దిశలో కథనం నడుస్తుంది. ఈ చిత్రంలో మోహన్‌ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న ఒక రాక్షస మహారాణి పాత్రలో నటిస్తోంది. 2009లో ఈ భారీ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 2011 జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu