»   » కే విశ్వనాథ్‌ను గౌరవించడం ఇదేనా?.. ప్రముఖులు మధ్యలోనే జారుకొన్నారు.. హీరోలు ముఖం చాటేశారు..

కే విశ్వనాథ్‌ను గౌరవించడం ఇదేనా?.. ప్రముఖులు మధ్యలోనే జారుకొన్నారు.. హీరోలు ముఖం చాటేశారు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశం గర్వించదగిన సినీ దర్శకుల్లో కాశీనాథుని విశ్వనాథ్ అలియాస్ కే విశ్వనాథ్ ఒకరు. తెలుగు, భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించారు. కమర్షియల్ చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో కే విశ్వనాథ్ తీసిన శంకరాభరణం చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. మీడియా, సోషల్ మీడియా ప్రభావం లేని కాలంలోనే ప్రపంచ సినీ అభిమానులను శంకరాభరణం చిత్రంతో ఉర్రూతలూగించారు. శంకరాభరాణానికి ముందు.. ఆ తర్వాత తీసిన చిత్రాలు ఆయనను దర్శక శిఖరంపై నిలబెట్టాయి. భారతీయ సినిమా పరిశ్రమకు చేసిన సేవలకు గాను ప్రభుత్వాలను ఆయనను ఎన్నో అవార్డులు, రివార్డులతో సత్కరించాయి. తాజాగా కే విశ్వనాథ్‌ను భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో ఆయనను సమోచితంగా గౌరవించేందుకు పలు  సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దర్శకుల సంఘం చేసిన సత్కార కార్యక్రమం తీరుపై అనేక విమర్శలు తావిచ్చింది.

దర్శకుల సంఘం ఆధ్వర్యంలో..

దర్శకుల సంఘం ఆధ్వర్యంలో..

దర్శక దిగ్గజం కే విశ్వనాథ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకొన్న సందర్భంగా ‘తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం పర్యవేక్షణలో తెలుగు సినీ పరిశ్రమ' అనే టైటిల్‌తో ఆయనను సత్కరించడానికి శనివారం (మే 20)న సన్మాన కార్యక్రమాన్ని మణికొండకు సమీపంలోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన విశ్వనాథ్‌ను, నరసింహన్‌ను భాజాభజంత్రీలతో వేద మంత్రాలతో స్వాగతించారు. అంతవరకు బాగానే ఉంది. ఇక కార్యక్రమం మొదలైన తర్వాత అసలు కథ ప్రారంభమైంది.

మొక్కుబడిగా..

మొక్కుబడిగా..

తెలుగు సినిమా పరిశ్రమ నిర్వహించే కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక చాలా పేలవంగా ఉన్నాయి. ఏదో మొక్కుబడిగా నిర్వహించారు అనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తీకరించారు. కాశీనాథనికి జరుగుతున్న సత్కార కార్యక్రమానికి దర్శకుల్లో వీలైనంత మంది తరలివచ్చారు. బాహుబలితో చరిత్ర సృష్టించిన ఎస్ఎస్ రాజమౌళి, వంశీ పైడిపళ్లి తదితరులంతా వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి టాలీవుడ్ చెందిన ఏ ఒక్క హీరో, హీరోయిన్లు రాకుండా ముఖం చాటేయడం చర్చనీయాంశమైంది.

ఎవరి గొడవ వారిదే..

ఎవరి గొడవ వారిదే..

గవర్నర్ ప్రొటోకాల్ ఉన్న స్టేజీపై అంతా గందరగోళమే. సన్మానం కోసం వేదికపైకి ఎక్కిన కొందరు సినీ ప్రముఖులు సన్మానం జరుగుతుండగానే ఎవరి మాటల్లో వారు పడిపోయారు. ఓ దశలో సన్మాన పత్రం చదివేందుకు వేదిక దిగిపోవాలని పలుమార్లు మైక్‌లో చెప్పాల్సి వచ్చింది. ఓ పద్దతి లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మధ్యలోనే జారుకొన్నారు..

మధ్యలోనే జారుకొన్నారు..

ఇక ఇదిలా ఉంటే, వేదిక మీద కార్యక్రమం జరుగుతుండగానే మరోపక్క ముఖం చూపి జారుకునే వాళ్లు జారుకున్నారు. ఏడున్నర ప్రాంతంలో వచ్చిన ముఖ్య అతిథి గవర్నర్ నరసింహన్ చాలా సహనంగా, ఓపిగ్గా కార్యక్రమంలో పాల్గొనగా, కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ఇంతకంటే ఏదో అర్జెంట్ పనుందని జారుకోవడం వచ్చినవారు ముక్కున వేలేసుకొనే పరిస్థితి ఏర్పడింది. కేవలం పురస్కారాలు అందుకోవడానికి వచ్చిన వాళ్లు, వాళ్ల సన్నిహితులు, సినీ అభిమానులు తప్ప మిగితా వారెవరూ కనిపించలేదు.

తక్కువ మంది మాత్రమే..

తక్కువ మంది మాత్రమే..

గవర్నర్ ముఖ్య అతిథి ప్రసంగం చేసే సమయానికి కేవలం కార్యక్రమాన్ని భుజాన వేసుకొన్న కొందరు ప్రముఖులు, చాలా తక్కువ సంఖ్యలో సినీ ప్రముఖులు, అభిమానులు మాత్రమే హాలులో కనిపించారు. సన్మాన కార్యక్రమం జరుగుతుండగానే రాజమౌళి కూడా మధ్యలోనే వెళ్లిపోయారు. అవార్డు అందుకొన్న వెంటనే మరికొందరు హాలు నుంచి ఉడాయించారు. ఆత్మీయ అతిథి, దర్శక దిగ్గజాన్ని సాదారంగా ఇంటికి పంపించి గౌరవించాలన్న విషయాన్నే మరిచిపోయారు మన సినీ పెద్దలు.

నరసింహన్ ప్రసంగం..

నరసింహన్ ప్రసంగం..

దర్శకుడు కే విశ్వనాథ్‌ను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం చాలా స్ఫూర్తిగా ఉంది. శంకరాభరణం చిత్రం సినీ పరిశ్రమకు ఆభరణం లాంటింది అని కీర్తించారు. మరెన్నో సంవత్సరాలు జీవించాలని భగవంతుడిని కోరుకొంటున్నాను. ఆయన సేవలు సినీ పరిశ్రమకు చాలా అవసరం అని చెప్పారు. సినీ పరిశ్రమకు ఒక బాహుబలి విశ్వనాథ్, మరో బాహుబలి రాజమౌళి అని అన్నారు. ఈ సమయంలో రాజమౌళి అక్కడ లేకపోవడం గమనార్హం. రాజమౌళి కార్యక్రమంలో లేరు. ఆయన వెళ్లిపోయారు అంటూ స్వయంగా గవర్నర్ తన మాటల్లోనే చెప్పారు.

హీరో, హీరోయిన్ల జాడేది..

హీరో, హీరోయిన్ల జాడేది..

కే విశ్వనాథ్ అంటే మామూలు వ్యక్తి కాదు. ఎందరో హీరోయిన్లకు, హీరోలకు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు నటజీవితాన్ని ప్రసాదించిన విశ్వనాథుడు. అంతటి ఘనకీర్తి కలిగిన మహానుభావుడికి జరుగుతున్న విశేష కార్యక్రమానికి సినీ హీరోలు, హీరోయిన్లు కనిపించకపోవడం ఆయనకు ఇచ్చే గౌరవాన్ని చెప్పకనే చెప్పింది. కనీసం వచ్చిన వారైనా హడావిడిగా జారుకోక కనీసం కార్యక్రమం ముగిసేంత వరకు ఉండే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

ప్రైవేటు కార్యక్రమాలకు వెళ్తారే..

ప్రైవేటు కార్యక్రమాలకు వెళ్తారే..

ఈ కార్యక్రమానికి ప్రముఖులు, అభిమానుల స్పందన అంతంత మాత్రంగానే ఉంది. హాలు సగానికి పైగా ఖాళీగానే ఉంది. వచ్చిన వాళ్లు మధ్యలోనే వెళ్లిపోవడం పరిస్థితి అధ్వాన్నంగా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో జరిగిందంటూ పేపర్లో ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా సినీ ప్రముఖుల నుంచి స్పందన రాకపోవడానికి కారణమేంటి? ఈ లోపం ఎవరిది? అసలేం జరిగింది? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. ప్రైవేటు కార్యక్రమాలకు జోష్‌గా వెళ్లే హీరోలు ఈ వేదిక వద్ద కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షికి ప్రశంస..

సాక్షికి ప్రశంస..

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా ప్రముఖ దిన పత్రిక సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కే విశ్వనాథ్, కైకాల సత్యనారాయణలను ఆత్మీయంగా సత్కరించింది. ప్రైవేటుగా జరిగిన ఈ కార్యక్రమంలో దిగ్గజ దర్శకుడు, నటుడికి ఇచ్చిన గౌరవంపై ప్రశంసల జల్లు కురిసింది.

English summary
Dada Saheb Phalke awarded K Vishwanath falicitated by Telugu Directors Association under supervision of Telugu Film Industry. But conduct of this program become centre of contravercy. So many criticised the way program conducted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu