»   »  కె. విశ్వనాథ్కు 'అల్లూరి' పురస్కారం

కె. విశ్వనాథ్కు 'అల్లూరి' పురస్కారం

Posted By:
Subscribe to Filmibeat Telugu
K Vishwanath
స్వాతిముత్యం,సాగరసంగమం,శంకరాభరణం వంటి ఎన్నో ఆణిముత్యాలను తన సినీ కెరీర్ లో అందించిం కళాతపస్వి కె.విశ్వనాధ్ కి అల్లురామలింగయ్య జాతీయ పురస్కారంతో సన్మానించబోతున్నారు. అల్లురామలింగయ్య కళాపీఠం తరపున ఈ పురస్కారాన్ని ఈ ఏడాది కె. విశ్వనాథ్‌కు బహూకరించనున్నట్లు నిర్ణయించినట్లు సంస్థ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు తెలియజేశారు.

అక్టోబర్ 1న అల్లురామలింగయ్య జయంతిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం హరిహరకళాభవన్‌లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సారిపల్లి కొండలరావు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్‌కు జ్ఞాపికతోపాటు స్వర్ణకంకణంతో సత్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వేడుకకు ప్రముఖ గాయని పి. సుశీల ముఖ్యఅతిథిగా పాల్గొననున్నట్లు తెలిపారు. ఇంకా ప్రముఖ సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X