»   » ప్రపంచవ్యాప్తంగా కాలా ఫీవర్.. సెలవు ప్రకటించిన ఐటీ కంపెనీ

ప్రపంచవ్యాప్తంగా కాలా ఫీవర్.. సెలవు ప్రకటించిన ఐటీ కంపెనీ

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Kaala Movie Release, IT Companies Declare A Holiday

  రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలూ.. ఫ్యాన్స్ ఫీవర్ పట్టుకోవడం చాలా సహజం. అడ్వాన్స్ బుకింగ్ ఎగబడటం, రిలీజ్ రోజున తలైవాపై అభిమానాన్ని చాటుకోవడానికి అభిమానులు హంగామా చేస్తుంటారు. ఆ రోజును పండుగల భావించే ఫ్యాన్స్ పనులన్నీ పక్కన పెట్టేసి ఆనందంలో మునిగిపోతారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఆరాట పడుతుంటారు. అందుకే కాలా చిత్రం రిలీజ్ నేపథ్యంలో కేరళలో ఓ ఐటీ కంపెనీ ఏకంగా జూన్ 7వ తేదీని హాలీడే‌గా ప్రకటించడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది.

  7న ఐటీ కంపెనీ హాలీడే

  7న ఐటీ కంపెనీ హాలీడే

  గతంలో కబాలి చిత్ర రిలీజ్ సందర్భంగా కూడా చాలా సంస్థలు తమ కార్యాలయాలకు సెలవు ప్రకటించాయి. ఉద్యోగుల సంతోషమే వారి ఆనందంగా భావించడమే కాకుండా జోష్ పెంచే ప్రయత్నం చేశాయి. తాజాగా కేరళలోని టెలియస్ టెక్నాలజీ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ కాలా రిలీజ్ రోజున సెలవు ప్రకటించింది.

  రజనీకాంత్ మాయలో ఉద్యోగులు

  రజనీకాంత్ మాయలో ఉద్యోగులు

  ఉద్యోగులందరూ రజనీ మానియాలో ఉన్నారు. వారి సంతోషాన్ని అడ్డుకోవడం అంతగా మంచిది కాదు. వారిని ఆపితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఓ రోజును సెలవుగా ప్రకటించామని సదరు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

  కంపెనీ అధికారిక ప్రకటన

  కంపెనీ అధికారిక ప్రకటన

  సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఉన్న విశేష అభిమానానికి గౌరవంగా, అలాగే ఉద్యోగుల రిక్వెస్ట్ మేరకు సంస్థ జూన్ 7వ తేదీన సెలవు దినంగా పాటిస్తున్నది అని సదరు కంపెనీ అధికారిక లెటర్ హెడ్‌పై ఓ నోటీసును జారీ చేసింది. టెలియస్ టెక్నాలజీ కంపెనీ జారీ చేసిన లెటర్ హెడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

  సెలవు మాట నిజమే

  సెలవు మాట నిజమే

  మా కంపెనీ కాలా రిలీజ్ సందర్భంగా సెలవు ప్రకటించిన విషయం వాస్తవమే. రజనీకాంత్ లాంటి వ్యక్తి ఉండటం దేశానికి గర్వకారణంగా భావిస్తాం. ఇది మా కంపెనీ పబ్లిసిటీ కోసం చేయడం లేదు అని టెలియస్ కంపెనీ ఉద్యోగి ఒకరు మీడియాకు వెల్లడించారు.

  ముంబై ధారవి మురికివాడ నేపథ్యంగా

  కబాలి తర్వాత వరుసగా రజనీతో జతకట్టిన పా రంజిత్ కాలా చిత్రానికి దర్శకుడు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబై ధారవి కథా నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో నానా పాటేకర్, ఈశ్వరీరావు, హ్యుమా ఖురేషి, సముద్ర ఖని తదితరులు నటించారు.

  English summary
  Rajinikanth's Kaala movie getting ready to release on June 7th. In this occassion, Kaala Audio function organised in Hyderabad on June 4th. Dhanush, Rajinikanth, Huma Quereshi were graced the function. Rajinikanth gives counter to Dhanush, which made comments about Thaliva. A Kerala-based company called Telious Technology seems to be aware of it. So it saved itself the trouble and declared a holiday for its employees on its own.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more