For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ‘కాలా’ కర్నాటక వివాదం: కూల్‌గా ఉన్న రజనీ.... ఏం తప్పు చేశారంటూ విశాల్ ఫైర్!

  By Bojja Kumar
  |
  Vishal Supports To Rajini On Kaala Issue

  రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాలా' చిత్రం జూన్ 7న విడుదలకు సిద్ధమైంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ గ్యాంగస్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న క్రమంలో కర్నాటకలో ఈ చిత్రం విడుదలను కన్నడిగులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం వివాదాస్పదం అయింది.

  ‘కాలా'పై కన్నడిగుల ఆందోళన

  ‘కాలా'పై కన్నడిగుల ఆందోళన

  కావేరీ జలాల వివాదంలో రజనీకాంత్ గతంలో చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనికి నిరసనగా ‘కాలా' చిత్రాన్ని కర్నాటకలో విడుదల అడ్డుకుంటామని కర్నాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. ఈ సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ల ఓనర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు సూచించింది. పలు కన్నడ సంఘాలు కూడా ‘కాలా' చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసేందుకు సిద్ధమయ్యాయి.

  స్నేహ పూర్వకంగా పరిష్కారం అవుతుందనే నమ్మకంతో రజనీకాంత్

  స్నేహ పూర్వకంగా పరిష్కారం అవుతుందనే నమ్మకంతో రజనీకాంత్

  అయితే సినిమా విడుదల సమయానికి ఈ సమస్య స్నేహ పూర్వకంగా పరిష్కారం అవుతుందనే నమ్మకంతో రజనీకాంత్ ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. సౌతిండియా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ మూవీ కర్నాటక రిలీజ్ విషయంలో కలుగజేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తోందట.

   రజనీకి మద్దతుగా నిలిచిన విశాల్

  రజనీకి మద్దతుగా నిలిచిన విశాల్

  ‘కాలా' సినిమాను కర్నాటకలో అడ్డుకోవడంపై తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ విశాల్ స్పందించారు. ‘కావేజీ జలాల విషయంలో రజనీ సార్ ఎంతో బాధ్యతగా మాట్లాడారు. ఆయనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాలను తమిళనాడు-కర్నాటక రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలని మాత్రమే ఆయన అన్నారు. ఇందులో తప్పుబట్టాల్సిన అవసరం ఏముంది? కర్నాటక ఫిలిం చాంబర్, కన్నడ సోదరులు ఈ ఇష్యూను త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. మనమంతా భారతీయులం అనే విషయం ఎవరూ మరిచిపోవద్దు' అని ట్వీట్ చేశారు.

  కాలా

  కాలా

  రజనీకాంత్‌తో పాటు ప్రముఖ హిందీ నటుడు నానా పాటేకర్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ముంబై మురికివాడ ధారావి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ధారావి డాన్ పాత్రలో రజనీకాంత్, రాజకీయ నాయకుడి పాత్రలో నానా పాటేకర్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటి హుమా ఖురేషి ముఖ్యపాత్ర పోషిస్తోంది. కబాలి తర్వాత దర్శకుడు పా రంజిత్‌తో రజనీకాంత్ చేస్తున్న రెండవ సినిమా ఇది. వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.

  English summary
  Rajinikanth hopes the Kaala issue in Karnataka gets resolved amicably and the South Indian Film Chamber of Commerce would intervene into the matter. Rajinikanth’s colleagues and admirers have been supporting the superstar in this cause and stating both the issues are different and shouldn’t be interlinked.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more