»   » పెద్ద మనసుతో ‘కాలా’ రిలీజ్ వాయిదా వేశారా? ఏది నిజం?

పెద్ద మనసుతో ‘కాలా’ రిలీజ్ వాయిదా వేశారా? ఏది నిజం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాలా' చిత్రం విడుదలను లైకా ప్రొడక్షన్స్ వాయిదా వేసింది. ఇతర తమిళ చిన్న సినిమాల విడుదలకు దారి సుగమం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 30 చిన్న సినిమాలు ఆగిపోయాయి

30 చిన్న సినిమాలు ఆగిపోయాయి

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ అధిక చార్జీలు వసూలు చేయడాన్ని నిరసిస్తూ తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మార్చి 1 నుండి స్ట్రైక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళన కారణంగా థియేటర్లు మూసి వేయడంతో సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న పలు చిన్న బడ్జెట్ తమిళ సినిమాల విడుదల ఆగిపోయింది. దాదాపు 30 సినిమాలు విడుదల పెండింగులో ఉన్నాయి.

Rajini Brand Mark Value For Dog రాత్రికి రాత్రికి అదృష్టం అంటే ఇదేనేమో ...
 పెద్ద మనసుతో ‘కాలా' రిలీజ్ వాయిదా, నిజమేనా?

పెద్ద మనసుతో ‘కాలా' రిలీజ్ వాయిదా, నిజమేనా?

మరో వైపు ‘కాలా' సినిమా ఏప్రిల్ 27న విడుదల ప్లాన్ చేశారు. దీంతో చిన్న సినిమాల నిర్మాతలంతా కలిసి తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించారని, రజనీకాంత్ సినిమా వాయిదా రిలీజ్ వాయిదా వేసేలా చూడాలని కోరారని, దీంతో ‘కాలా' మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న ‘లైకా ప్రొడక్షన్స్' వారితో కౌన్సిల్ చర్చలు జరిపారని. చిన్న సినిమాలు నష్టపోకూడదని, చిన్న నిర్మాతలు రోడ్డున పడకూడదనే ఉద్దేశ్యంతో వారు కూడా ‘కాలా'ను వాయిదా వేయడానికి అంగీకరించారని ప్రచారం మొదలైంది.

 నెల రోజులు ఆలస్యంగా ‘కాలా'?

నెల రోజులు ఆలస్యంగా ‘కాలా'?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘కాలా' చిత్రాన్ని దాదాపు నెల రోజులు ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంలో లైకా సంస్థ నుండి ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు.

లైకా సంస్థ ట్విట్టర్లో ఇలా

‘కాలా’ రిలీజ్ డేట్ విషయంలో గానీ .. ఈ సినిమాకి సంబంధించిన మరే అనధికారిక స్టేట్మెంట్స్ తో గాని తమకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే సినిమా రిలీజ్ ఏప్పుడు అనే విషయంలో మాత్రం చెప్పలేదు.

 ధనుష్‌కు 125 కోట్ల లాభం

ధనుష్‌కు 125 కోట్ల లాభం

‘కాలా' చిత్రాన్ని దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రజనీకాంత్ సినిమా కావడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. దాదాపు రూ. 125 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి. దీంతో పాటు శాటిలైట్ రైట్స్ రూపంలో రూ. 75 కోట్లు అదనంగా వచ్చాయి. ఈ చిత్రాన్ని నిర్మించిన రజనీకాంత్ అల్లుడు ధనుష్ రూ. 125 కోట్ల లాభాన్నీ సినిమా రిలీజ్ ముందే ఆర్జించారు.

 కాలా

కాలా

రజనీకాంత్ ఇమేజ్‌కు తగిన విధంగా గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ కాలా కరికాలన్ అనే డాన్ పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటుడు నానా పాటేకర్, హ్యూమా ఖురేషి ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ చిత్రం మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Lyca Productions has postponed the release date of director Pa Ranjith's upcoming movie Kaala starring Rajinikanth in a bid to make way for other Tamil movies, which are waiting for the release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X