»   » కాలా సంచలనం.. యూట్యూబ్‌లో సునామీ.. కేకపుట్టిస్తున్న డైలాగ్స్

కాలా సంచలనం.. యూట్యూబ్‌లో సునామీ.. కేకపుట్టిస్తున్న డైలాగ్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'కాలా' టీజర్‌
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ధనుష్‌ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌, వండర్‌బార్‌ ఫిలింస్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై పా.రంజిత్‌ దర్శకత్వంలో ధనుష్‌ నిర్మిస్తున్న చిత్రం 'కాలా'. ఏప్రిల్‌ 27న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ విడుదల చేశారు. ఈ టీజర్ అన్ని ఫ్లాట్‌ఫాంలలో అత్యధిక వ్యూస్‌తో సంచలనం రేపుతున్నది.

17 మిలియన్ల వ్యూస్

17 మిలియన్ల వ్యూస్

తమిళ కాలా చిత్ర టీజర్‌కు ఇప్పటి వరకు 13,265,420 వ్యూస్ లభించాయి. 30 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. తెలుగులో కాలా టీజర్‌కు 2,714,002 వ్యూస్ వచ్చాయి. హిందీ టీజర్‌కు 1,358,837 వ్యూస్ లభించాయి. గత మూడు రోజుల్లో 17 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించడం గమనార్హం.

కేక పుట్టిస్తున్న డైలాగ్స్

కేక పుట్టిస్తున్న డైలాగ్స్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొత్త లుక్‌, డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనున్నాయి. 'నలుపు శ్రమ జీవుల వర్ణం.. మా వాడకొచ్చి చూడు మురికంతా ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది' అని డైలాగ్స్ ఆకట్టుకొంటున్నాయి.

క్లాప్స్ పడటం ఖాయం..

క్లాప్స్ పడటం ఖాయం..

'క్యారే సెట్టింగా.. వీరయ్య బిడ్డన్రా.. ఒక్కడ్నే ఉన్నా.. దిల్లుంటే గుంపుగా రండ్రా..' , 'ఈ కరికాలుడి పూర్తి రౌడీయిజాన్ని ఎప్పుడూ చూళ్ళేదు కదూ.. ఇప్పుడు చూపిస్తా..' అంటూ రజనీకాంత్‌ తనదైన స్టైల్‌లో చెప్పిన డైలాగ్స్‌ థియేటర్స్‌లో క్లాప్స్‌ కొట్టిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

పా రంజిత్‌పై భారీగా అంచనాలు

పా రంజిత్‌పై భారీగా అంచనాలు

రజనీకాంత్‌, పా.రంజిత్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'కబాలి' రిలీజ్‌కి ముందు, రిలీజ్‌ తర్వాత ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. 'కాలా' టీజర్‌ రిలీజ్‌తో మరోసారి వీరిద్దరి సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కెరీర్‌లో 'కాలా' మరో సెన్సేషనల్‌ మూవీగా నిలవబోతోంది.

నటీనటులు

నటీనటులు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, నానా పాటేకర్‌, సముద్రఖని, ప్రకాశ్‌రాజ్‌, ఈశ్వరీరావు, హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతికవర్గం

సాంకేతికవర్గం

కాలా చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, సినిమాటోగ్రఫీ: మురళి జి., ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వినోద్‌కుమార్‌, నిర్మాత: ధనుష్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పా. రంజిత్‌.

English summary
The teaser of Rajinikanth’s highly-anticipated gangster drama released yesterday in the midnight and received tremendous response from the audience. In just 3 days, the teaser garnered over 17.5 million views across all the social media platforms.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu