కార్తి.... ‘కాష్మోరా’ ట్రైలర్ అదిరిపోయింది (వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: హీరో కార్తీ 'కాష్మోరా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన కార్తి డిఫరెంట్ లుక్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. తాజాగా ట్రైలర్ కూడా వచ్చింది.

ఈ చిత్రంలో కార్తీ పాత్ర మూడు విభిన్నమైన షేడ్స్ లో ఉంటుందని....సైనికాధికారిగా, గూఢచారిగా, నేటితరం యువకుడిగా మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రంలో నయనతార, శ్రీ దివ్య హీరోయిన్లుగా చేస్తున్నారు.

ఇందులో నయన్ రత్నమహాదేవి పాత్రలో కనిపించబోతోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే గతంలో మనమెప్పుడూ చూడని నయనతారను చూడబోతున్నామని స్పష్టమవుతోంది.

పీవీపీ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కాష్మోరా ఫస్ట్‌లుక్ విడుదల దగ్గరనుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. కార్తి కెరీర్లోనే ఇదే బిగ్గెస్ట్ చిత్రం కాబోతోందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X