»   » ‘కబాలి’ దెబ్బకు బాహుబలి రికార్డ్స్ ఢమాల్ (డిటేల్స్)

‘కబాలి’ దెబ్బకు బాహుబలి రికార్డ్స్ ఢమాల్ (డిటేల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'కబాలి' సినిమా రిలీజ్ ముందు నుండే భారీ హైప్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కబాలి ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా సినిమా రిలీజైన తర్వాత బాహుబలి రికార్డుల్లో కొన్నింటిని ఇప్పటికే బద్దలు కొట్టింది.

సౌతిండియాలో ఇప్పటి వరకు పెద్ద సినిమాగా, పలు న్యూ రికార్డు బద్దలు కొట్టిన సినిమా గా 'బాహుబలి' చరిత్రకెక్కింది. యూఎస్ఏలో బాహుబలి క్రియేట్ చేసి రికార్డులను 'కబాలి' తిరిగ రాసింది. రజనీకాంత్‌కు ఉన్న క్రేజే ఇందుకు కారణం.


యూఎస్ఏ బాక్సాఫీసు వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రీమియర్ షోల ద్వారా 'కబాలి' చిత్రం 1.45 మిలియన్ డాలర్లు (రూ.9.8 కోట్లు) వసూలు చేసింది. బాహుబలి సినిమా విషయానికొచ్చేసరికి ఇది కేవలం 1.39 మిలియన్ డాలర్లు మాత్రమే.


బాహుబలి చిత్రం రిలీజ్ తర్వాత కూడా సూపర్ హిట్ టాక్ తో భారీ వసూళ్లు సాధించింది. మరి 'కబాలి' సినిమా ఫుల్ రన్ లో ఆ రేంజిలో వసూలు చేస్తుందా? లేదా? అనేది తెలాల్సి ఉంది. ఇక తమిళనాడులో అయితే అన్ని సినిమాల రికార్డులు బద్దలవ్వడం ఖాయం అంటున్నారు. సినిమాకు భారీ హైప్ వచ్చిన నేపథ్యంలో ఫస్ట్ వీకెండ్ తమిళనాడులో రూ. 50 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


అయితే కబాలి సినిమా ఇప్పటికే ఆన్ లైన్లో పైరసీ కాపీ లీక్ కావడంతో ఈ ఎఫెక్టు సినిమాపై పడుతుందని అంటున్నారు. మరి నిర్మాతలు దీనికి ఎలా అడ్డుకట్ట వేస్తారు? అనేది తేలాల్సి ఉంది....


నెం.1 ఇండియన్ ప్రీమియర్ గ్రాసర్

నెం.1 ఇండియన్ ప్రీమియర్ గ్రాసర్

కబాలి మూవీ యూఎస్ఏలో ఆల్ టైమ్ నెం.1 ఇండియన్ ప్రీమియర్ గ్రాసర్ గా నిలిచింది.


యూఎస్ఏ

యూఎస్ఏ

కబాలి యూఎస్ఏ రైట్స్ రూ. 8.5 కోట్లకు అమ్ముడు పోయింది. ప్రీమియర్ షోలు పూర్తికాక ముందే ఆ మొత్తం తిరిగి వచ్చేసింది.


భారీ రిలీజ్

భారీ రిలీజ్

యూఎస్ఏలో ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ రిలీజ్ కానంత భారీగా కబాలి రిలీజైంది.


ఆస్ట్రేలియాలో.

ఆస్ట్రేలియాలో.

ఆస్ట్రేలియాలో ఓపెనింగ్స్ పరంగా నెం.1 తమిళ చిత్రంగా నిలిచింది.


100 కోట్లే..

100 కోట్లే..

కబాలి సినిమా 2 రోజుల్లో 100 కోట్లు వసూలు చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.


సౌతిండియాలో

సౌతిండియాలో

కబాలి మూవీ సౌతిండియాలో ఫస్ట్ డే ....


ఫ్రాన్స్ లో..

ఫ్రాన్స్ లో..

ఫ్రాన్స్ లో కూడా కబాలి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.


English summary
Even before its release, there were widespread talks about Kabali's dominance at the worldwide box office and how it might scale new heights by breaking the box office records set by recently released blockbusters. Well, looks like the Rajinikanth-starrer is right on course to achieve the numbers discussed by fans and producer 'Kalaipuli' S Thanu before its release, for Kabali has already broken the record set by Baahubali in the USA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu