Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కబాలీ పేరుతో కామెడీ చేస్తున్నారనుకున్నా... సౌత్ సినిమాలమీద రాధికా ఆప్టే మరో వ్యాఖ్య
సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన తార రాధికా ఆప్టే. కాకపోతే ఆమె మాటలు కాస్త ఘాటుగా..సూటిగా ఉంటాయి. గతం లో తెలుగు హీరోల గురించి వివాదాస్పద వాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన బాలీవుడ్ భామ రాధిక ఆప్టే ఇప్పుడు దర్శకులకు కండిషన్లు పెడుతుందట. ఇప్పటికే హిందీ, మరాఠీ, బెంగాలీ చిత్రాలలో మంచి నటిగా పేరు తెచుకున్న రాధిక ఆప్టే సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన కబాలి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించినప్పటికీ మంచి గుర్తింపు రాలేదు నటి రాధిక ఆప్టేకి. కానీ రజనీకాంత్‌తో కబాలి లో జోడీ కడుతోందన్న మాటతో ప్రత్యేక గుర్తింపు సాధించింది.
దీనితో రాధిక ఆప్టే కి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.. ఈ మధ్యనే ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలే చెప్పింది రాధిక...
అసలు రాధికా కి కబాలి ఆఫర్ ఎలా వచ్చిందీ..? ఆమె ఆట్టిట్యూడ్ వల్ల ఇప్పటికే దక్షిణాది హీరోలకి నోట్లో పచ్చివెలక్కాయ పడ్డ సంఘటనలు ఉన్నా మళ్ళీ ఆమెను సౌత్ సినిమాలో ఎలా తీసుకున్నారూ ఇవన్నీ ఆమె మాటల్లోనే... స్లైడ్ షో లో....

కబాలీ లో అవకాశం కోసం ఏ ఏజెన్సీని నేను
సంప్రదించలేదు.దర్శకుడు రంజిత్ నుంచి ఫోన్ వచ్చింది. రజనీకాంత్ నటిస్తున్న కబాలి సినిమా గురించి మాట్లాడాలని అన్నారు. కానీ నేనేదో కామెడీకి అడుగుతున్నారని అనుకున్నా. కొన్ని రోజుల తర్వాత చెన్నైకి రావాలని విమాన టికెట్ కూడా పంపించారు. చాలా ఆశ్చర్యపోయా. అయినప్పటికీ ఖరారు చేసుకోలేదు..

కబాలీ పేరుతో కామెడీ చేస్తున్నారనుకున్నా... సౌత్ సినిమాలమీద రాధికా ఆప్టే మరో వ్యాఖ్య
కబాలి కథ గురించి చెప్పారు. వెంటనే బాగా నచ్చింది. అందులోనూ రజనీకాంత్‌తో నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? తప్పకుండా నటిస్తానని చెప్పా. వాళ్ళు పిలవటం, నేను ఆలోచించుకొని ఓకే చెప్పటం అంతా ఒక వారం రోజుల్లో అయిపోయింది. ఇక నేనే రజినీ సార్ హీరోయిన్ అని ఫిక్సైపోయాను.

కబాలీ పేరుతో కామెడీ చేస్తున్నారనుకున్నా... సౌత్ సినిమాలమీద రాధికా ఆప్టే మరో వ్యాఖ్య
కథని బట్టి ఒక టీనేజ్ అమ్మాయికి తల్లిగా మధ్య వయస్కురాలిగా కనిపించాలి...పూర్తి డీ గ్లామరైజ్డ్ రోల్ అయితే... ఇప్పుడే ఈ సాహసం చేయవద్దని కొందరు సలహా ఇచ్చారు.

కబాలీ పేరుతో కామెడీ చేస్తున్నారనుకున్నా... సౌత్ సినిమాలమీద రాధికా ఆప్టే మరో వ్యాఖ్య
కానీ నేను వినిపించుకోలేదు. ఎవరికో తప్ప రాని అవకాశం నాకు వచ్చింది. దాన్ని మిస్ చేసుకోదలుచుకోలేదు. అందుకే ఎవరెన్ని చెప్పినా పట్టించుకోకుండా తల్లి పాత్ర చేశాను. అవడానికి తల్లి పాత్రే కానీ, మిడిల్ ఏజ్ మహిళగా కని పిస్తాను.

కబాలీ పేరుతో కామెడీ చేస్తున్నారనుకున్నా... సౌత్ సినిమాలమీద రాధికా ఆప్టే మరో వ్యాఖ్య
రజనీకాంత్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారని తెలుసు. కానీ ఎంతలా ఉంటారోనన్న విషయాన్ని తెలుసుకున్నా. ఓ సారి ఆసుపత్రిలో చిత్రీకరణ జరిపాం. అక్కడ వేలాది మంది అభిమానులు గుమిగూడారు. దీంతో ఆ రోజు చిత్రీకరణకు ఆటంకం కలిగింది. అంతస్థాయిలో అభిమానులు వచ్చారు. అప్పుడే ఆయన అభిమానుల ప్రత్యేకత గురించి తెలిసింది.

కబాలీ పేరుతో కామెడీ చేస్తున్నారనుకున్నా... సౌత్ సినిమాలమీద రాధికా ఆప్టే మరో వ్యాఖ్య
నా జీవితంలోనే అదొక గొప్ప అనుభవం, స్ఫూర్తిదాయకం. ఆయనొక వండర్‌ఫుల్ మనిషి. ఆయనలా ఎవరూ ఉండరు, ఉండలేరు. రజనీ స్టైల్ చూస్తే మతి పోతుంది. ఆయనకు ఆయనే సాటి.

కబాలీ పేరుతో కామెడీ చేస్తున్నారనుకున్నా... సౌత్ సినిమాలమీద రాధికా ఆప్టే మరో వ్యాఖ్య
రజనీతో నటించడాన్ని నా జీవితంలోనే మరిచిపోలేను. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా భావిస్తూ ప్రతి సన్నివేశంలోనూ నటించా. నేను చూసిన నటుల్లో.. వృత్తిపట్ల రజనీకాంత్‌లా అంకితభావం ఉన్న వ్యక్తులను చూడలేదు. సెట్‌లో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తారు.

కబాలీ పేరుతో కామెడీ చేస్తున్నారనుకున్నా... సౌత్ సినిమాలమీద రాధికా ఆప్టే మరో వ్యాఖ్య
ఆయన నడక, ఆహార్యం, స్టెల్, తదుపరి షాట్‌కు తనను తాను మలచుకునే తీరు, వారి నిరాడంబరత, ఇతరులతో వ్యవహరించే విధానం, అందరికీ మర్యాదనిచ్చే శైలి.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు చెప్పుకుంటూ వెళ్లొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే రజనీకాంత్ అద్భుతమైన వ్యక్తిత్వమున్న మనిషి. ఆయనలా ఇంకొకరు లేదు

కబాలీ పేరుతో కామెడీ చేస్తున్నారనుకున్నా... సౌత్ సినిమాలమీద రాధికా ఆప్టే మరో వ్యాఖ్య
గతంలో దక్షిణాదిన కొన్ని మాత్రమే సినిమాలు చేశాను తప్ప వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఇక నుంచి ఉత్తరాది కన్నా దక్షిణాదినే ఎక్కువ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాను. ఇప్పటి వరకూ దక్షిణాదిన ఏ సినిమా ఒప్పుకోలేదు. కథలు అయితే వింటున్నాను.