»   » తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ.... (కబాలి కౌంట్)

తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ.... (కబాలి కౌంట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు సౌత్‌లో ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పడానికి 'కబాలి' సినిమానే ఒక ఉదాహరణ. ఇక రజనీకాంత్‌ను ఆరాధ్య నటుడిగా కొలిచే తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

కొన్ని రోజులుగా సౌత్ సినిమా సర్కిల్‌లో కబాలి ఫీవర్ ఓ రేంజిలో నడుస్తోంది. సినిమాకు ఉన్న క్రేజ్‌‌కు తగిన విధంగానే సినిమాను భారీగా రిలీజ్ చేసారు. రజనీకాంత్ సినిమా కాబట్టి తమిళనాడులోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతుందని అంతా భావించారు.


కానీ కాబాలి విషయంలో పరిస్థితి డిఫరెంటుగా ఉంది. తమిళనాట కంటే తెలుగునాడులోనే సినిమా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళనాడులో దాదాపు 650 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఆంధ్ర, తెలంగాణలో కలిపి ఈచిత్రం తెలుగులో దాదాపు 850 థియేటర్లలో రిలీజ్ కావడం గమనార్హం.


హిందీలో కూడా 'కబాలి' సినిమా భారీగానే రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ దాదాపు 4 వేలకు పైగా థియేటర్లలో సినిమా రిలీజైంది. స్లైడ్ అందకు సంబంధించిన వివరాలు...


తమిళనాడు

తమిళనాడు

తమిళనాడులో ‘కబాలి' మూవీ 650 థియేటర్లలో రిలీజైంది.


ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో కబాలి మూవీ 530 థియేటర్లలో రిలీజైంది.


తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ ప్రాంతంలో ‘కబాలి' మూవీ 330 థియేటర్లలో రిలీజైంది.


కేరళ

కేరళ

కేరళలో కబాలి మూవీ 308 థియేటర్లలో రిలీజైంది


కర్నాటక

కర్నాటక

కర్నాటకలో కబాలి చిత్రం 251 థియేటర్లలో రిలీజైంది.


రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియాలో హిందీ వెర్షన్ 1100 థియేటర్లలో రిలీజైంది.


యూఎస్ఏలో

యూఎస్ఏలో

యూఎస్ఏలో తెలుగు, తమిళం, హిందీ వెర్షన్లు కలిపి ఏకంగా 450 స్క్రీన్లలో రిలీజ్ చేసారు.


రెస్టాఫ్ వరల్డ్

రెస్టాఫ్ వరల్డ్

ఆస్ట్రేలియా, మలేషియా, యూకె, దుబాయ్ ఇలా ఇతర దేశాలన్నింటిలో కలిపి 550 స్క్రీన్లలో కబాలి మూవీ రిలీజ్ చేసారు.


టోటల్

టోటల్

టోటల్ 4174 థియేటర్లలో కబాలి మూవీ రిలీజైంది.
English summary
Super Star Rajinikanth Kabali is hitting the screens tomorrow on a massive scale in Telugu, Tamil, Malayalam and Hindi languages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu