»   » ‘కబాలి’ రిజల్ట్, హెల్త్ సమస్యలపై... ఫ్యాన్స్‌కు రజనీకాంత్ లేఖ (ఫోటోస్)

‘కబాలి’ రిజల్ట్, హెల్త్ సమస్యలపై... ఫ్యాన్స్‌కు రజనీకాంత్ లేఖ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'కబాలి' సినిమా విడుదల ముందు నుండే సంచలనాలు క్రియేట్ చేసింది. బహుషా ఈ సినిమాకు వచ్చినంత క్రేజ్ సౌత్ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు రాలేదేమో. మరో వైపు సినిమా విడుదల ముందు రజనీకాంత్ అమెరికా వెళ్లడం, ఆయన ఆరోగ్యంపై అనేక రూమర్స్ వినిపించడం తెలిసిందే.

ఒకానొక సందర్భంలో రజనీకాంత్ అనారోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండటం, ఆడియో వేడుక కూడా రద్దు చేయడంతో అభిమానుల్లో తెలియని ఆందోళన. రజనీ పరిస్థితి బాగోలేదు, సినిమా రిలీజ్ అవుతుందో? లేదో? అనే వార్తలు అభిమానులకు ఆ మధ్య నిద్ర లేకుండా చేసాయి. రజనీ కుటుంబం మొత్తం అమెరికా వెళ్లడం కూడా ఈ అనుమానాలకు మరింత బాలాన్ని ఇచ్చింది.


అయితే కాల క్రమంలో రూమర్స్‌కు తెరపడింది...అంతా మంచే జరిగింది.. ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమాను రిలీజ్ అయింది. రజనీకాంత్‌ పరిస్థితి బాగానే ఉందని తెలియడంతో ఫ్యాన్స్ కూడా కూల్ అయ్యారు. అమెరికా నుండి సోషల్ మీడియా ద్వారా రజనీకాంత్ ఫోటోలు షేర్ చేయడంతో అనుమానాలన్నీ తొలగిపోయాయి.


'కబాలి' రిలీజ్ సమయంలో రజనీకాంత్ అమెరికాలోనే ఉన్నారు. రిలీజ్ అయ్యాక ఇటీవలే ఆయన ఇండియా తిరిగి వచ్చారు. తాజాగా ఆయన కబాలి సినిమా రిజల్టు మీద, తన ఆరోగ్యం వస్తున్న వార్తలపై స్పందిస్తూ అభిమానులకు లేఖ రాసారు... (రజనీ లేఖలో ఏం చెప్పారు అనే విషయాలు స్లైడ్ షోలో)


నన్ను బతికిస్తున్న..

నన్ను బతికిస్తున్న..

నన్ను బతికిస్తున్న తమిళ ప్రజలందరికీ నా నమస్కారాలు అంటూ రజనీ మొదలు పెట్టారు...


తీరికలేని షూటింగ్ వల్లే..

తీరికలేని షూటింగ్ వల్లే..

‘2.o', ‘కబాలి'లో తీరిక లేకుండా నటించినందు వల్లే అలసటకు గురై అనారోగ్యం పాలయ్యానని రజనీకాంత్ ఈ సందర్భంగా అభిమానులకు చెప్పుకొచ్చారు.


చికిత్స కోసమే..

చికిత్స కోసమే..

అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికే అమెరికా వెళ్లానని, ఇపుడు పూర్తి ఆరోగ్యంతో ఉత్సాహంగా చెన్నైకి తిరిగొచ్చానని రజనీకాంత్ తెలిపారు.


విశ్రాంతి అవసరం అయింది

విశ్రాంతి అవసరం అయింది

నా ఆరోగ్యానికి, మనస్సుకు విశ్రాంతి అవసరమైంది. నా కూతురు ఐశ్వర్యా, ధనుష్‌తో కలిసి రెండు మాసాలపాటు అమెరికాలో విశ్రాంతి తీసుకుని, వైద్య చికిత్సలందుకుని ఆరోగ్యంగాను, ఉత్సాహంగాను మాతృభూమికి తిరిగొచ్చాను అని రజనీ తెలిపారు.


కబాలి విజయంపై...

కబాలి విజయంపై...

‘కబాలి' విజయం ఆనందాన్నిచ్చిందని, ఇందుకు కారణమైన అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని రజనీ తన లేఖలో తెలిపారు.


సంతోషం..

సంతోషం..

‘కబాలి' విజయం సాధించిందన్న సమాచారం అమెరికాలోనే తెలుసుకున్నా, ఇప్పుడు నేరుగా తెలుసుకోవడంతో మరింత సంతోషంగా ఉన్నాను అని తెలిపారు.


చిత్ర సభ్యులకు..

చిత్ర సభ్యులకు..

కబాలి చిత్రాన్ని నిర్మించిన థానుకి, దర్శకుడు పా.రంజితకు, చిత్ర బృందానికి, సహ నటీనటులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని రజనీకాంత్ పేర్కొన్నారు.


అభిమానులకు శిరస్సు వంచి...

అభిమానులకు శిరస్సు వంచి...

‘కబాలి'ని హిట్‌ చిత్రంగా మార్చిన నా అభిమానులకు, ప్రజలకు, యువతకు ముఖ్యంగా మహిళలకు, పాత్రికేయమిత్రులకు, థియేటర్‌ యజమానులకు, పంపిణీదారులకు శిరస్సువంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.


మగిళ్చి

మగిళ్చి

రజనీ తన లేఖ చివర్లో మగిళ్చి (సంతోషం) అంటూ పేర్కొనడం గమనార్హం.


English summary
Rajinikanth, in a short letter, extended his gratitude to producer Thanu, director Ranjith and his crew, fans, youngsters, women, the media, theatre owners and distributors, for the grand success of Kabali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu