»   » 'కబాలి ' ఎఫెక్ట్: టెన్షన్ లో టీమ్,ఎమర్జన్సీ మీటింగ్,నిర్ణయాలు

'కబాలి ' ఎఫెక్ట్: టెన్షన్ లో టీమ్,ఎమర్జన్సీ మీటింగ్,నిర్ణయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: టాక్ తేడాగా వచ్చినా 'కబాలి' బాక్సాఫీసు వద్ద వీరవిహారం చేస్తోంది. రజనీకాంత్‌ హీరోగా నటించిన ఈ చిత్రం అంచనాలను మించి కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ నెల 22న విడుదలైన 'కబాలి' తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లు వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

ఈ సినిమా గురించి మరో షాక్ ఇచ్చే విషయం ఏమిటీ అంటే.. మన దేశంలో వస్తున్న కలెక్షన్స్ కు పోటీపడుతూ దీటుగా ఓవర్సీస్‌లోనూ దూసుకుపోతోంది 'కబాలి'. విదేశాల్లో తొలి వారాంతంలోనే రూ.87 కోట్లు వసూలు చేసింది. దీంతో విదేశాల్లో అత్యధిక తొలి వారాంతపు వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.


దాంతో 'కబాలి'టెన్షన్ మొదలైంది దర్శకుడు శంకర్ కి అని తమిళ ఫిల్మ్ సర్క్లిల్స్ లో వినిపిస్తోంది. ఇంత హైప్, ఇంత క్రేజ్ కబాలికి వస్తుందని ఆయన భావించలేదట. అదే ఇప్పుడు సినిమా మొదటి రోజు నెగిటివ్ టాక్ కు కారణమైందని ఆయన భావిస్తున్నారు. దాంతో ఆయన ఎమర్జన్సీ మీటింగ్ కు తన టీమ్ ని కాలఫర్ చేసారని తమిళ సినీ సర్కిల్స్ లో వినపడుతోంది.


సాధారణంగా ఓ హీరో చిత్రం హిట్ అయితే తదుపరి ఆ హీరోతో చేసే చిత్రం నిర్మాతలు ఫుల్ ఖుషీ అవుతారు. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుపై ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి సిద్దపడతారు. అది డైరక్టర్ కు ఆనందం. అయితే సినిమాకు సంభంధం లేకుండా ఈ క్రేజ్ తో హైప్ పెరిగిపోతే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఆ హైప్ ని ఏ మాత్రం రీచ్ కాకపోయినా ఇప్పుడు కబాలి దర్శకుడుని తిట్టినట్లుగా తిట్టిపోస్తూంటారు.


ఇవన్నీ ఆలోచించే...తన డైరక్షన్ టీమ్ తో సహా, మెత్తం టెక్నికల్ టీమ్ ని అంతటినీ సమావేశపరిచి శంకర్ కబాలి ఎఫెక్ట్ తమ చిత్రంపై పడి తమను ఇబ్బందుల్లో పడేయకుండా ఏం చేయాలో మాట్లాడినట్లు తెలుస్తోంది.


'రోబో 2' షెడ్యూల్స్ మొత్తం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది.. అంటే 2017లో దీపావళి కానుకగా ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉందని అక్షయ్ చెప్పుకొచ్చాడట. దీంతో రోబో 2 మూవీ దీపావళికి బెర్త్ కన్ఫామ్ చేసుకున్నట్టే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక ఇందులో 'ఐ' బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏదేమైనా రోబో 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.స్లైడ్ షోలో మీటింగ్ శంకర్ చెప్పిన విషయాలేమిటి, మిగతా డిడేల్స్...


మాట్లాడొద్దు

మాట్లాడొద్దు

తమ తాజా చిత్రం రోబో 2 గురించి ఎట్టిపరిస్దితుల్లోనూ ఎక్కడా మాట్లాడవద్దని సీరియస్ గా చెప్పాడట.నో లీక్స్

నో లీక్స్


తమ సినిమాకు సంభంధించిన చిన్న వీడియో కానీ, ఫొటో గానీ లీకైనా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడటక్రేజ్ దెబ్బ కొడుతుంది

క్రేజ్ దెబ్బ కొడుతుంది


కబాలి క్రేజ్ తో వచ్చే ప్రేక్షకుడికి తమ సినిమా ఆనకపోతే పెద్ద ప్రమాదం. సినిమా డిజాస్టర్ అవుతుంది. అందుకే అన్ని మరోసారి జాగ్రత్తగా ఆలోచించాలని నిర్ణయంబడ్జెట్ కంట్రోలు

బడ్జెట్ కంట్రోలు


తేడా వచ్చినా తన అంతకు ముందు చిత్రం ఐ తరహాలో భారీగా నష్టపోకుండా , బడ్జెట్ ని సాధ్యమైనంత కంట్రోలు లో పెట్టడం.బిజినెస్ లో..

బిజినెస్ లో..


సినిమాని కబాలి కొన్నవారే కొనే అవకాసం ఉంది,బయ్యర్లు హై రేట్లు పెట్టరు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు.కబాలిని మించి...

కబాలిని మించి...


అంతకు మించి అన్నట్లుగా కబాలిని మించి తమ కాంబినేషన్ కు క్రేజ్ వచ్చే అవకాసం ఉంది కాబట్టి,అంచనాలు పెరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.నిర్మాత విభేధం

నిర్మాత విభేధం


అంచనాలు పెరగకపోతే సినిమా పై పెట్టిన పెట్టుబడి కు తగ్గ బిజినెస్ జరగదని రోబో 2 నిర్మాత వాదిస్తున్నట్లు సమాచారం.హిందీ మార్కెట్

హిందీ మార్కెట్


తమ రోబో 2 చిత్రానికి హిందీ మార్కెట్ కూడా తోడవుతుందని భావిస్తున్నారు. హిందీ వెర్షన్ కు అక్షయ్ ప్లస్ అవుతాడని అంచనా వేస్తున్నారు.రికవరీలు లేకపోతే

రికవరీలు లేకపోతే


కబాలి చిత్రానికి అనుకున్నట్లు గా రికవరీ రాకపోతే, ఖచ్చితంగా ఆ రికవరీ రానివారు రోబో 2 నిర్మాతపై పడటం ఖాయం. దానికి సిద్దంగా ఉండాలి.సీక్వెల్స్

సీక్వెల్స్


మనకు సీక్వెల్స్ పెద్దగా కలిసిరాని వాతావరణం ఉంది. ఆ వంక పెట్టి రోబో కు సీక్వెల్ గా వచ్చే సినిమా..బిజినెస్ ని తక్కువ రేటుకు అడిగే ప్రమాదం ఉంది.బడ్జెట్ ఇంత

బడ్జెట్ ఇంత


రోబో బడ్జెట్ కి డబుల్ అమౌంట్ పెట్టనున్నట్లు, శంకర్ 400కోట్ల బడ్జెట్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం


ఇన్సూరెన్స్

ఇన్సూరెన్స్


‘రోబో 2'ని 350 కోట్లకి ఇన్సూరెన్స్‌ చేయించారట! ఇంత భారీ మొత్తాన్ని ఒక సినిమాకు ఖర్చు పెట్టడమే భారతదేశ సినిమా చరిత్రలో మొదటిసారి అనుకుంటే ఇంచుమించు అంత మొత్తాన్ని ఇన్సూరెన్స్‌ చేయడం కూడా మొదటిసారే అంటున్నారు.ఆ మధ్యన

ఆ మధ్యన


శంకర్ కూడా తమ చిత్రం రోబో 2 వందరోజులు పూర్తి చేసిందని ప్రకటన చేసారు. రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న రోబో2.0 వంద రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుంది.గత ఏడాది...

గత ఏడాది...


డిసెంబర్ 16న ప్రారంభమైన రోబో 2.0 సినిమాను నిర్విరామంగా 100 రోజుల పాటు చిత్రీకరించారు.అప్పనుంచీ అక్షయ్

అప్పనుంచీ అక్షయ్


మార్చి 21న అక్షయ్ రోబో 2.0 టీమ్ తో జాయిన్ అయ్యారు.English summary
Rajini fever is everywhere as the much-anticipated Kabali storms into theatres four days back. Kabali craziness can be found splashed all across social media platforms – from Twitter and Instagram to Facebook and Reddit. And Now Kabali craze became tension to Shankar's latest Robo 2.0. Shankar called emergency meetings to deal with Kabali craze.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu