For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అంతకు మించి - కబాలి గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు (ఫొటో స్టోరీ)

  |

  రజనీకాంత్ -పా రంజిత్ ... ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని కాంబో ఇది. అలాంటి పెద్ద హీరో... కేవలం రెండే సినిమాలు చేసిన డైరెక్టర్ ను తన మూవీకి సెలెక్ట్ చేసుకున్నాడు.అసలు వీళ్లిద్దరికీ ఎలా కుదిరింది అంటూ ఆశ్చర్య పోయారంతా. స్టార్ రజనీకాంత్ మూవీ అంటే చాలు ఇండియాలోనే కాదు ప్రపంచం లోని మరికొన్ని దేశాల్లో కూడా యమా క్రేజ్.

  వచ్చే నెలలో రిలీజ్ అవబోతున్న కబాలి కోసం కూడా కోసం రజనీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే ...అంతకు ముందు రెండే రెండు సినిమాలు డైరెక్ట్ చేసిన పా రంజిత్ కు రజనీ ఛాన్స్ ఇచ్చాడు. ఇదేలా సాధ్యమయ్యిందీ అంటే ఈ అంతటికీ కారణం సూపర్ స్టార్ చిన్న కూతురు సౌందర్యేనట. వెంకట్ ప్రభు దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నప్పుడే ఈ ఇద్దరూ పరిచయమయ్యారట. అప్పుడే తాను తీయాలనుకుంటున్న "అట్త కత్తి" కథని సౌందర్య కి చెప్పాడట రంజిత్.

  అయితే "అట్టకత్తి" సౌందర్య నే తీద్దామనుకున్నా అప్పుడు కుదరలేదు.అట్టకత్తి చూసిన రజిని "సినిమా బాగా తీసాడీ కురాడు" అని ం,ఎచ్చుకోవటం తో...కబ్బాలికి రంజిత్ నే ఎందుకు తీసుకోకూడదూ అనుకున్న సౌందర్య... రంజిత్ ని రెకమండ్ చేసింది...ఇక "కబాలీ డా...!" అంటూ రజినీ రెడీ ఐపోయాడు.

  మరి రెండు సినిమాల అనుభవం ఉన్న రంజిత్.. రజినీ లాంటి హీరో ని ఎలా హ్యాండిల్ చేసాడూ? అసలు కబాలి తో ప్రేక్షకులను మెప్పించ గలుగుతాడా..? అనుకునే వారికి మాత్రం అద్బుతమైన ఆశ్చర్యమే ఎదురయ్యేలా ఉంది. కబాలీ లో ఉన్న మెరుపులేమిటంటే.....

  స్పెషల్ కబాలి యాప్

  స్పెషల్ కబాలి యాప్

  "కబాలి" కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఇందులో "కబాలి"కి సంబంధించిన విశేషాలూ నిత్యం అప్ డేట్ చేస్తున్నారు.

  "కుతు" డాన్స్

  ఈ చిత్రంలో రజనీ "కుతు" అనే తమిళ సంప్రదాయ నృత్యం చేసే సన్నివేశం ఉందట. రజనీ స్టెప్పులు అభిమానులను అలరిస్తాయని అంటున్నారు.

  అమేజాన్ లో కీచైన్లు

  అమేజాన్ లో కీచైన్లు

  అమెజాన్‌ ద్వారా "కబాలి" థీమ్‌ కీచైన్లు, మైనపు బొమ్మలు అమ్మకానికి ఉంచడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే స్మార్ట్ ఫోనె కవర్లూ, టీ షర్టులూ హల్ చల్ చేస్తున్నాయ్.

  మలేషియన్ లోకల్ కాస్ట్యూమ్స్

  మలేషియన్ లోకల్ కాస్ట్యూమ్స్

  అను వర్ధన్‌ అనే అమ్మాయి రజనీకి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసింది. లండన్‌లోని ఓ ప్రముఖ స్టోర్‌ నుంచి కాస్ట్యూమ్స్‌కు కావాల్సిన ముడి వస్త్రాలు కొనుగోలు చేశారట. మలేసియాలో జరిగే సన్నివేశాల కోసం అక్కడి ట్రెండ్స్‌ను ప్రతిబింబించేలా లోకల్‌ స్టోర్స్‌లో నుంచే కాస్ట్యూమ్స్‌ తెప్పించారట.

  విలన్ కూడా లోకల్

  విలన్ కూడా లోకల్

  "కబాలి" చిత్రీకరణ ఎక్కువ భాగం మలేసియాలో జరిగింది. ఇందులో విలన్‌తో పాటు కొన్ని ఇతర కీలక పాత్రల్లో విదేశీ నటులు నటించడం విశేషం. ప్రముఖ తైవాన్‌ నటుడు విన్‌స్టన్‌ చావొ ప్రతినాయకుడిగా నటించగా, అతని రైట్‌హ్యాండ్‌గా మలేసియన్‌ నటుడు రోసియమ్‌ నొర్‌ నటించారు.

  మలేషియా ఫ్యాన్స్ హంగామా

  మలేషియా ఫ్యాన్స్ హంగామా

  మలేసియాలో చిత్రీకరణ జరుగుతున్నపుడు అక్కడ షూటింగ్‌ కోసం 25 లగ్జరీ కార్లు అవసరం కాగా అక్కడి అభిమానులే వాటిని సమకూర్చారట. ఆడియో రిలీజ్‌ రోజున ఆ కార్ల యజమానులు "కబాలి" పోస్టర్లతో రోడ్‌షో చేశారు.

  బిజినెస్‌ 200 కోట్లకుపైగానే

  బిజినెస్‌ 200 కోట్లకుపైగానే

  "బాషా" లాంటి రికార్డ్ మూవీ తర్వాత ఇన్నేళ్ళకి మళ్లీ రజనీ డాన్‌గా నటిస్తున్న "కబాలి"పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే ఆ సినిమా బిజినెస్‌ ఆకాశన్నంటుతోంది. ప్రి రిలీజ్‌లోనే రూ.200 కోట్లకుపైగా బిజినెస్‌ జరుగుతున్నట్లు సమాచారం.

  ఇప్పుడు రజినీ ఇంటర్నేషనల్ మానియా

  ఇప్పుడు రజినీ ఇంటర్నేషనల్ మానియా

  రజనీ మానియా విదేశాలకూ పాకింది. గతంలో రజనీ చిత్రాలకు జపాన్‌ తదితర దేశాల్లో మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు "కబాలి" మరిన్ని దేశాల్లో సంచలనాలు చేయడానికి సిద్ధమవుతోంది.

  పది వేల థియేటర్లలో విడుదల

  పది వేల థియేటర్లలో విడుదల

  ప్రపంచవ్యాప్తంగా పది వేల థియేటర్లలో విడుదలవుతోంది. చైనాలో "పీకే", "బాహుబలి" తర్వాత ఐదు వేల థియేటర్లలో విడుదలవుతన్న మూడో భారతీయ చిత్రమిది. చైనీస్‌, మలై, థాయ్‌, జపనీస్‌ భాషల్లోకి అనువాదమవుతున్న తొలి తమిళ చిత్రమిది.

  బెంగళూరు నుంచి చెన్నైకి విమానమే

  బెంగళూరు నుంచి చెన్నైకి విమానమే

  కబాలి" ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోనే చూడాలనుకునే అభిమానుల కోసం ఆ చిత్ర నిర్మాతలు ఓ ప్రత్యేక అవకాశాన్ని కల్పించారు. "కబాలి" చూడ్డానికొచ్చేవారి కోసం బెంగళూరు నుంచి చెన్నైకి విమానాన్ని ఏర్పాటు చేశారు. దీని కోసం ఎయిర్‌ ఏసియా విమాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. విమానం టికెట్‌తో పాటు "కబాలి" టికెట్‌, ఆడియో సీడీ, భోజనం తదితర సౌకర్యాలు అందిస్తారట. ఈ ఆఫర్‌కు విశేష స్పందన వస్తోంది.

  తెలుగు ఆడియో

  తెలుగు ఆడియో

  "కబాలి" తెలుగు ఆడియో విడుదల హైదరాబాద్‌లో ఈనెల 26న జరగనుంది.

  English summary
  Interesting things about Superstar Rajinikanth's Next Movie "Kabali"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X