»   » బాహుబలిని బ్రేక్ చేస్తాం, ఈజీగా 500 కోట్లు: ‘కబాలి’ నిర్మాత ప్రకటన

బాహుబలిని బ్రేక్ చేస్తాం, ఈజీగా 500 కోట్లు: ‘కబాలి’ నిర్మాత ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'కబాలి' సినిమా సూపర్ హిట్ అవుతుంది, 'బాహుబలి' రికార్డును బ్రేక్ చేయడం ఖాయం, సినిమా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అంటూ ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను ప్రకటించారు. ఈ సినిమా కనీసం రూ. 500 కోట్లు వసూలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

నిర్మాత క‌లై ఫులి ఎస్ థాను స్పందిస్తూ....క‌బాలి బిజినెస్ ఊహించని విధంగా జరుగుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా కనీసం 500 కోట్లు క‌లెక్ట్ చేస్తుందనే అనేది నమ్మకం ఉంది. బాహుబ‌లి రికార్డ్ ను క‌బాలి బ్రేక్ చేస్తాం...ర‌జ‌నీకాంత్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ర‌జ‌నీ అభిమానుల్లో అన్ని వ‌యసుల వాళ్లు ఉన్నారు. ఖ‌చ్చితంగా క‌బాలి 500 కోట్లు క‌లెక్ట్ చేస్తుంది.

Kabali will collect Rs. 500 cr

యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన క‌బాలి ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 22న రిలీజ్ అవుతుంది. సాధారణంగానే ర‌జనీకాంత్ సినిమా అంటే క్రేజ్ ఓరేంజ్ లో ఉంటుంది. 'కబాలి' ట్రైలర్ ఎఫెక్టుతో ఈ సినిమాపై ఎవరూ ఊహించనంత అంచనాలు పెరిగాయి.

మరో వైపు ప్రమోషన్లు కూడా కనీవినీ ఎరుగని రీతిలో చేస్తున్నారు. ఇపుడు ఎక్కడ చూసినా క‌బాలి గురించే టాపిక్. ఇంత‌లా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న క‌బాలి ఎంత క‌లెక్ట్ చేస్తుందనేది హాట్ టాపిక్ అయింది. సినిమా రిలీజ్ ముందు రూ. 200 కోట్లు బిజినెస్ చేసింది.

English summary
Kabali producer KS.Thanu said, Super star Rajinikanth starrer will collect Rs. 500 cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu