పవన్,ఎస్ జె సూర్య సినిమాకు క్రేజీ టైటిల్ ? పూరి ముందే వెటకారం చేసాడు

By Srikanya

హైదరాబాద్ : 'గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు.. అదే కడప కింగ్ అని తీయండి.. టు హండ్రెడ్ సెంటర్స్.. హండ్రెడ్ డేస్ ఆడుతుంది..' ఈ డైలాగు మీకు గుర్తుందా... పూరి జగన్నాధ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి చిత్రం లో ఓ పాపులర్ డైలాగు ఇది. ప్రేక్షకుల ఎలాంటి టైటిల్స్ ని ఆదరిస్తున్నారో వెటకారంగా పూరి చెప్పిన డైలాగు ఇది. ఈ విషయంఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే..పవన్ కళ్యాణ్ తాజా చిత్రానికి ఇదే పెట్టిల్ పెట్టబోతున్నారట.

'సర్దార్ గబ్బర్ సింగ్' తర్వాత పవన్.. ఎస్.జె. సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు ఏవేవో టైటిల్స్ వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం 'కడప కింగ్' అనే పేరు తెరపైకొచ్చింది.

pawan kalyan

ఇందులో పవన్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నాడని , ఫ్యాక్షన్ నేపధ్యంలో జరిగే ప్రేమ కథ ఇదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'కడప కింగ్' టైటిల్ అయితే బాగుంటుదని భావించిన దర్శక నిర్మాతలు.. రీసెంట్ గా ఫిల్మ్ ఛాంబర్ లో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు టాక్. అయితే ఈ టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేస్తున్నారా లేదని చేప్పలేమంటున్నారు సినీజనాలు

పవన్ కి జోడిగా గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కడప ఫాక్షన్ లీడర్ గా కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. దాంతో సినిమాకు మొదట హుషారు అనే సాఫ్ట్ టైటిల్ అనుకున్న తరువాత సేనాపతి అనే పవర్ ఫుల్ టైటిల్ ని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ టైటిల్ ని కూడా పక్కకు పెట్టారట.

ఈ టైటిల్ అయితే పవన్ ఇమేజ్ కి పక్కగా సెట్ అవుతుందనే భావనలో ఉన్నారట. మరి ఇదే ఫైనల్ టైటిల్ అనుకోవచ్చు అని అంటున్నా ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావాల్సి ఉంది. ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ లో కానీ వచ్చే సంక్రాంతికి కానీ రిలీజ్ చేయబోతున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X