»   » కిడ్నాప్, మర్డర్ కేసులో హీరోయిన్ విద్యా బాలన్!

కిడ్నాప్, మర్డర్ కేసులో హీరోయిన్ విద్యా బాలన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ విద్యా బాలన్ మీద కిడ్నాప్, మర్డర్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. దీంతో ఆమె ఆచూకి తెలిస్తే వెంటనే తెలియజేయండి అంటూ.... సోషల్ మీడియాలో ఓ పోస్టర్ దర్శనమిస్తోంది. ఇంతా రియల్ లైఫ్ కి సంబంధించినది కాదు... రీల్ లైఫ్‌కి సంబందించినది.

Kahaani 2 first look: Vidya Balan is a wanted criminal

విద్యా బాలన్ నటిస్తున్న కహానీ-2 చిత్రానికి సంబందించిన ఫస్ట్‌లుక్‌ ఇలా రిలీజ్ చేసారన్నమాట. ఇందులో విద్య దుర్గా రాణీ సింగ్‌ పాత్రలో కన్పించబోతోంది. విద్యాబాలన్ మెయిన్ రోల్‌లో తెరకెక్కిన "కహానీ" సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. కనపడకుండా పోయిన తన భర్త ఆచూకీని తెలుసుకునేందుకు ఓ గర్భిణీ ఎలా ముందుకెళ్లిందనే ఇతివృత్తంతో సుజయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన కహాని బిగ్గెస్ట్ హిట్‌. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా కహానీ-2 తెరకెక్కుతోంది.


ఈ చిత్రంలో విద్యాబాలన్‌తో పాటు అర్జున్‌ రామ్ పాల్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఎక్కవ భాగం షూటింగ్ కోల్‌కతా జరిగింది. ఈ చిత్రం డిసెంబర్‌ 2న విడుదల కాబోతోంది.
English summary
The first look of Vidya Balan starrer Kahaani 2: Durga Rani Singh is out. The film is postponed on December 2.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu