»   » సూపర్బ్: విద్యా బాలన్ ‘కహాని-2’ థియేట్రికల్ ట్రైలర్

సూపర్బ్: విద్యా బాలన్ ‘కహాని-2’ థియేట్రికల్ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ విద్యా బాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'కహాని' సినిమా అప్పట్లో బాలీవుడ్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేసారు. కనపడకుండా పోయిన తన భర్త ఆచూకీని తెలుసుకునేందుకు ఓ గర్భిణీ ఎలా ముందుకెళ్లిందనే ఇతివృత్తంతో సుజయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన కహాని బిగ్గెస్ట్ హిట్‌.

ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కించిన కహానీ-2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో విద్య దుర్గా రాణీ సింగ్‌ పాత్రలో కన్పించబోతోంది. ఆమె మీద కిడ్నాప్, మర్డర్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఆమెకోసం వెతుకుతున్నారు. దీని వెనక మిస్టరీ ఏమిటి అనేది తెరపై ఆసక్తికరంగా చూపించబోతున్నారు.

Kahaani 2 Official Trailer

తాజాగా కహాని-2 థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ సూపర్బ్ గా ఉంది. ఇటీవల వాంటెడ్ అంటూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయంగా మంచి స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ చిత్రంలో విద్యాబాలన్‌తో పాటు అర్జున్‌ రామ్ పాల్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఎక్కవ భాగం షూటింగ్ కోల్‌కతా జరిగింది. ఈ చిత్రం డిసెంబర్‌ 2న విడుదల కాబోతోంది.

English summary
Durga Rani Singh, is 'Wanted' for murder & kidnapping. Want to know her Kahaani? Watch the official trailer here. Starring Vidya Balan & Arjun Rampal, Jayantilal Gada (pen) presents “Kahaani 2”, directed by Sujoy Ghosh. Produced by Sujoy Ghosh, Kushal Kantilal Gada, Dhaval Jayantilal Gada & Aksshay Jayantilal Gada and co-produced by Reshmaa Kadakia & Suresh Nair, the film is slated to release on December 2nd, 2016.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu