twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోలపై విమర్శలు, బాహుబలిపై కూడా...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన విజువల్ వండర్ గా చెప్పబడుతున్న 'బాహుబలి'పై కొందరు సీనియర్ యాక్టర్లు విమర్శలు చేసిన ఘటనలు గతంలో చూసాం. తాజాగా మరో సీనియర్ నటుడు, తెలుగు గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కైకాల సత్యనారాయణ కూడా బాహుబలిపై విమర్శలు చేసారు.

    జులై 25న తన పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూలో ఆయన బాహుబలి గురించి స్పందిస్తూ... 'అసలు బాహుబలి సినిమాలో ఏముందండీ? ఏదైనా మంచి డైలాగ్ ఉందా? ఆహ్లాదకరమైన సంగీతం ఉందా? కథ ఏమైనా ఉందా? ఇటువంటి యుద్ధ సన్నివేశాలన్నీ అప్పట్లో విఠలాచార్యగారు తీసారు. ఆ రోజుల్లో ఫైట్స్ ని ట్రిక్స్ అనేవారు. ఇపుడేమో గ్రాఫిక్స్ అని పేరు పెట్టి కోట్లు ఖర్చు పెడుతున్నారు' అని విమర్శించారు.

    'కోట్లు మంది చూసే సినిమా సొసైటీకి ఉపయోగపడాలి. అఫ్ కోర్స్ సినిమా ఈజ్ బిగ్ ఎంటర్టెన్మెంట్. కాదనడం లేదు. కోట్లు ఖర్చు పెడుతున్నపుడు ఎంటర్టెన్మెంటుతో ఇస్తూనే సొసైటీకి, ప్రజలకు ఉపయోగపడే చిత్రాలు తీయాలి. కేవలం ఎంటర్టెన్మెంటు కోసం వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు' అని కైకాల చెప్పుకొచ్చారు.

    ఇప్పటి హీరోలు, నటులపైనా కైకాల విమర్శలు చేసారు. అప్పట్లో మేం డబ్బు కోసం పాకులాడేవాళ్లం కాదు. ఎంత సేపూ మంచి పాత్ర చేయాలి. పేరు రావాలి. జనాల హృదయాల్లో స్థానం సంపాదించాలి అని కృషి చేసే వాళ్లం. ఇప్పుడేంటంటే డబ్బే ప్రధానం అయిపోయింది అందరికీ. నటన పరంగా కష్టపడే తత్వం పోయింది....(మిగతా వివరాలు స్లైడ్ షోలో)

    అన్ని కోట్లు ఇవ్వడం దేనికి

    అన్ని కోట్లు ఇవ్వడం దేనికి


    రెండు పిక్చర్లు చేశారంటే రెండు కోట్లు, మూడు, నాలుగు, పది కోట్లు ఇలా పెరిగిపోతోంది. ఇన్నేసి కోట్లు ఇవ్వడం ఏమిటో అర్థం కావడం లేదు అంటూ కైకాల విస్మయం వ్యక్తం చేసారు.

    సీనియర్లు

    సీనియర్లు


    మా కాలంలో మేం సీనియర్లకు తగిన గౌరవం ఇచ్చేవాళ్ళం. కాంతారావుగారు, మిక్కిలినేనిగారి తర్వాతే నేను ఇండస్ట్రీకి వచ్చాను. అయితే వారికంటే నాకే సినిమాలు ఉండేవి. అయినా వారు సెట్స్ కు వస్తే లేచి నిలబడి గౌరవం ఇచ్చేవాళ్లం అన్నారు.

    ఇప్పటి తరం

    ఇప్పటి తరం


    ఇప్పటి తరం వారికి సీరియర్లంటే గౌరవం లేదు. చూస్తే నమస్కారం పెట్టాల్సి వస్తుందని హడావుడిగా వెళ్లిపోతారు. మనంతట మనమే విష్ చేస్తే చూసి చూడనట్లు వెళ్లిపోయారు అంటూ కైకాల వ్యాఖ్యానించారు.

    గౌరవించడం లేదు

    గౌరవించడం లేదు


    రామారావు గారు, ఏఎన్ఆర్ గారి లాంటి సీనియర్లు వెళ్లిపోయారు. ఉన్న వాళ్లలో నేను సీనియర్ మోస్ట్ ని. నాకేం గౌరవం ఇస్తున్నారు చెప్పండి. ఓ సినిమా ప్రివ్యూకి పిలుస్తున్నారా? ఓ ఫంక్షన్ కి పిలుస్తున్నారా? అవార్డు ఫంక్షన్ కి ఏమైనా పిలుస్తున్నారా? ఎప్పుడైనా టీవీలో ఆ ఫ్రోగ్రామ్ చూసి అరె ఇదెప్పుడు జరిగింది..కనీసం మనల్ని పిలవను కూడా పిలవలేదే అని అనుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు అని కైకాల వ్యాఖ్యానించారు.

    English summary
    In his latest birthday interview to a leading Telugu news daily, veteran character artiste Kaikala Satyanarayana criticized Baahubali and said that Baahubali had no good story, no impressive dialogues or music and that even the action sequences are made with the help of expensive graphics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X