»   » సచిన్ కోసం ప్రముఖ గాయకుడు...'సచిన్‌ ఆంథమ్‌'

సచిన్ కోసం ప్రముఖ గాయకుడు...'సచిన్‌ ఆంథమ్‌'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kailash Kher creates special song on Sachin Tendulkar
ముంబై:మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ రంగం నుంచి విరమిస్తున్న సందర్భంగా ఆయన గౌరవార్థం గాయకుడు కైలాష్‌ ఖేర్‌ 'సచిన్‌ ఆంథమ్‌' పాటని ఆలపిస్తున్నారు. తేరీ దీవానీ, తౌబా తౌబా, యా రబ్బా తదితర హిట్‌ గీతాలను అందించిన ఖేర్‌.. సచిన్‌ను అపురూపమైన వ్యక్తిగా వర్ణించారు.

ప్రపంచంలో చాలామంది మంచివాళ్లు ఉండవచ్చు కానీ కొంతమంది అరుదైన వ్యక్తులు ఉంటారని, అటువంటి వారిలో సచిన్‌ ఒకరని ఖేర్‌ అన్నారు. ఆయన క్రీడా స్ఫూర్తితో తాను ప్రేరణ పొందానన్నారు. తాను పాడే పాట సచిన్‌ ఘనమైన కీర్తి ప్రతిష్టల గురించి, ఆయన జాతి గర్వించతగ్గ వ్యక్తిగా ఎలా అయ్యారో వివరిస్తుందని వివరించారు. పాటని ఖేర్‌ వెబ్‌సైట్‌లో వినవచ్చు.

సచిన్‌ క్రికెట్‌ రంగం నుంచి విరమించిన తర్వాత తనతో కలిసి పాడమని తాను ఏదో ఒకరోజు ఆయన్ని కోరతానని ఖేర్‌ చెప్పారు. ఆయన క్రికెట్‌లో రికార్డులు బద్దలు కొట్టారని, ఆయన్ని ఇతర విషయాల్లో నిమగ్నం చేయడం గొప్పగా ఉంటుందన్నారు. తాను పాడిన పాటని సచిన్‌కి పంపించామని, పాటని నెలపాటు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఇది ఒక ప్రముఖ వ్యక్తి మరో ప్రముఖ వ్యక్తిని ప్రసంశించే విషయమని ఈ పాట విన్నవాళ్లు అంటున్నారు.

ఇక భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నవంబర్ 14 నుంచి 18వరకు వాంఖేడే స్డేడియంలో జరుగనున్న మ్యాచుకు బాలీవుడ్ తారలు హాజరుకానున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చివరిదైన 200వ టెస్టు మ్యాచు కావడంతో బాలీవుడ్ తారలు మ్యాచును చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ కథనాయకులు అమీర్‌ఖాన్, రణ్‌బీర్ కపూర్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తదితరులు మ్యాచును ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.

అయితే ఈ మ్యాచును బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ వీక్షించలేకపోతున్నాడు. గతంలో స్టేడియం సెక్యూరిటీ గార్డులతో జరిగిన వివాదం సందర్భంగా మరోసారి ఈ స్టేడియంలో అడుగుపెట్టనని షారుక్ అన్నారు. దీంతో సచిన్ రిటైర్మెంట్ తీసుకునే టెస్ట్ సిరీస్‌ను షారుక్ దూరమవుతుతున్నారు. కోల్‌కతాలో జరిగిన 199వ టెస్టు మ్యాచు మూడు రోజుల్లో ముగియడంతో ఆ మ్యాచును చూసేందుకు కూడా షారుక్‌కు అవకాశం లేకపోయింది.

English summary
Singer Kailash Kher has come up with a special song called 'Sachin Anthem' to pay his tribute to the master blaster Sachin Tendulkar. "The world has many good people but some are rare. I was impressed by the spirit of his (Sachin) game. It has been named 'Sachin Anthem' because this was the most apt name we could come up with. This is my tribute to Sachin. This song talks about the glory of master blaster and explain why he is the pride of the nation," Kher told in an interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu