»   » పొడవైన హీరో ప్రభాస్‌ తో అయితే...కాజల్

పొడవైన హీరో ప్రభాస్‌ తో అయితే...కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచి పొడవైన హీరో ప్రభాస్(హైట్‌ 6.2) సరసన నటిస్తే హైహీల్స్‌ చెప్పులు వాడతాను. హైహీల్స్‌ అంటే నాకు చాలా ఇష్టం.అయితే కొందరు హీరోల సరసన నటిస్తున్నప్పుడు హీల్స్‌లెస్‌ చెప్పులు వాడాల్సి వస్తుంది.అంటూ చెప్పుకొచ్చింది కాజల్. మీరు మంచి హైట్‌. ఇది మీకు ప్లస్సా..మైనస్సా అన్న ప్రశ్నకు జవాబిస్తూ...ఇక ఈ సంవత్సరం ఆమె చిత్రాలు సంఖ్య తగ్గిన విషయం ప్రస్తావిస్తే..ఎన్ని చిత్రాలు విడుదలయ్యాయనేది కాకుండా ఎన్ని విజ యవంతమైన చిత్రాలలో నటించామన్నదే ముఖ్యం. ఏ ఏడాదికి ఐదు లేక ఆరు చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నాను. తెలుగులో నటించిన డార్లింగ్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మగధీర చిత్రం తరువాత చిత్రాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నాను. అందుకే చాలా అవకాశాలు వస్తున్నా ఆచితూచి అడుగేస్తున్నాను. మరి బాలీవుడ్ కి వెళ్ళరా అంటే...హిందీ చిత్రాలలో నటించనని కాదు. నేను పంజాబీ బిడ్డను. హిందీ చిత్రాల్లో నటించడం నాకు ఎంతో సులభం. మంచి అవకాశం అనుకున్నప్పుడు తప్పక నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ ఎన్టీఆర్ సరసన బృందావనం లోనూ, ప్రభాస్ సరసన డార్లింగ్ లోనూ చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu