»   » పెళ్లి కాకుండానే సహజీవనం గురించి హీరోయిన్ కాజల్

పెళ్లి కాకుండానే సహజీవనం గురించి హీరోయిన్ కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోకుండానే పరస్పర అంగీకరాంతో కలిసి జీవించడం, కాపురం చేయడం, పెళ్లికి ముందే సెక్స్, పిల్లల్ని కనడం లాంటి సంస్కృతి మన దేశంలోనూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఇలంటి విషయాల్లో సినిమా వాళ్లు ముందు ఉంటున్నారు.

ఇలాంటి సంస్కృతి మన దేశంలో విస్తరించడంపై కొందరు సాంప్రదాయ వాదులు సంప్రదాయ వాదులు వ్యతిరేకిస్తున్నారు. అయితే హీరోయిన్ కాజల్ మాత్రం సమర్దిస్తోంది. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉన్నప్పుడు అందులో తప్పేంలేదనుకుంటాను. మన సంప్రదాయానికి వ్యతిరేకం కాదనేది తన అభిప్రాయమని తెలిపింది. తాను ఎవరితోనూ సహజీవనం చేయడం లేదని, కాబోయేవాడు బాగా చదువుకుని, స్వతంత్ర నిర్ణయాలతో ఆశావహ దృక్ఫథంలో ఉండే వాడు కావాలంటోంది.

Kajal Agarwal about Live-in Relation

కాజల్ సినిమాల విషయానికొస్తే... ఆమె విశాల్ కు జోడీగా నటించిన ‘పాయుమ్ పులి' అనే తమిళ సినిమా గత వారం తెలుగులో ‘జయసూర్య'గా విడుదలై ఓపెనింగ్స్ పరంగా ఫర్వాలేదనిపించింది. గతేడాది అమ్మడుకు పెద్దగా అవకాశాలు లేక పోయినా ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలు ఉన్నాయి.

తెలుగులో పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంతో పాటు, మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం' చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటే హిందీలో ఒకటి, తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Kajal Agarwal Supports Live-in Relation ship Culture in India.
Please Wait while comments are loading...