కుర్ర హీరోకు కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్
దక్షిణాదిలో అగ్రహీరోలతోపాటు కుర్ర హీరోలతో జతకట్టి హిట్లు కొడుతున్న కాజల్ అగర్వాల్ మరో యువ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తొలి చిత్ర దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో వంశధార క్రియేషన్స్ రూపొందించే ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రంలో నటించేందుకు కాజల్ అగర్వాల్ ఒకే చెప్పింది. ఈ చిత్రంలో యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలకపాత్రను పోషిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమై తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు, చోటాకే కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, చోటా కే నాయుడు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ సొంటినేని, చాగంటి శంతయ్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
kajal agarwal bellamkonda sai srinivas neil nitin mukesh కాజల్ అగర్వాల్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నీల్ నితిన్ ముఖేష్


Click it and Unblock the Notifications