»   » 'చండీ'నుండి కాజల్‌ను గెంటేసిన ఎమ్మెస్ రాజు..?!

'చండీ'నుండి కాజల్‌ను గెంటేసిన ఎమ్మెస్ రాజు..?!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సక్సెస్ ‌ఫుల్ ప్రొడ్యూసర్ యంఎస్ రాజురాజు క్రమశిక్షణకు మారుపేరు అని సినీ ఇండస్ట్రీలో పేరు. మొన్న సినీ నిర్మాతలు ఖర్చులను తగ్గించుకోవాలని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసిన నేపధ్యంలో తొలిసారిగా దానిని ఆచరణలో పెట్టారు రాజు. ప్రస్తుతం టాలీవుడ్ టాఫ్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ బ్లాక్ బస్టర్ 'మగధీర" సినిమాలో రామ్ చరణ్ సరసన నటించి కోట్లమంది ఫాన్స్ గుండెల్లో గుబులు పుట్టించింది. తర్వాత ఎంయస్ రాజు నిర్మాణంలో లేడి ఓరియంటెడ్ పాత్ర చేస్తున్నదని ఆ మధ్య సమాచారం వచ్చింది. అయితే ఎంయస్ రాజునిర్మిస్తున్న తదుపరి చిత్రం 'ఛండీ"కి గాను కాజల్ అగర్వాల్ పారితోషికం(ఒక కోటి రూపాయలు) చుక్కలను చూస్తూ ఉండటంతో ఆమెను ఆ చిత్రం నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆ స్థానంలో మరో కొత్త హీరోయిన్‌ ను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల భారీ పారితోషికాలను ఆశిస్తున్న హీరోహీరోయిన్లు క్రమంగా తమ రేట్లను తగ్గించుకోక తప్పదు. లేదంటే వారి స్థానాలను కొత్తవాళ్లు ఆక్రమించుకోవడం ఖాయం. నిర్మాతలు అనుకుంటే ఇండస్ట్రీని గాడిలో పెట్టవచ్చని, మిగిలిన నిర్మాతలు కూడా యంఎస్ రాజు రాజుగారి బాటలో పయనిస్తే నిర్మాతలకు కష్టాలు చాలా వరకూ తగ్గిపోతాయంటున్నారు సినీ విశ్లేషకులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu