»   » ఆ చేదు అనుభవం మర్చిపోయినట్టుంది : కాజల్ మళ్ళీ అలానే కనిపించింది

ఆ చేదు అనుభవం మర్చిపోయినట్టుంది : కాజల్ మళ్ళీ అలానే కనిపించింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాధారణంగా హీరోయిన్స్ మేకప్ వేసుకుంటే ఒక విధంగా, మేకప్ లేకుండా వేరొక విధంగా ఉంటారు. అయితే తనకు అలాంటి సమస్యే లేదంటోంది.. చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్. మేకప్ లేకపోయినా మిగిలిన హీరోయిన్స్‌లా కాకుండా తాను అందంగా ఉంటానని చెప్పుకొచ్చింది.

ఎన్నేసి సినిమాల్లో చేసినా.. ఎంత గ్లామర్ గా ఒలికించినా.. అమ్మడిలో చూపించాల్సిన అందం చాలానే ఉంటుంది. అయితే.. కాజల్ కి ఏమైందో తెలీదు కానీ.. ఒక్కసారిగా మేకప్ లేకుండా ఫోటోలకు పోజులు ఇచ్చేసింది. ఎంత గ్లామరస్ హీరోయిన్ అయినా.. ఆ గ్లామర్ సీక్రెట్ అంతా మేకప్ లోనే ఉంటుందనే విషయం ఒప్పుకోవాల్సిందే.

Kajal Agarwal Without Makeup Picture

అయితే.. ఆ మేకప్ నే దూరం పెట్టేసి భయపెట్టేస్తోంది కాజల్. వైట్ టాప్.. డెనిమ్ జీన్స్ లో డ్రెసింగ్ అయితే సూపర్ గా ఉంది కానీ.. సమ్మర్ సీజన్ కు సెట్ అయ్యేది కాదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. గతం లో కూడా ఇలాగే ఆటా సభలకి మేకప్ లేకుండా వెళ్లటం తో ఈవిడ గారిని వదిలేసి అంతా రాశీఖన్నా వెనక పడటం తో కాస్త హర్టయ్యిందీ అని వార్తలు వినిపించాయి.

మరి అంతటి అనుభవాన్ని కూడా గుర్తుంచుకోకుండా మళ్ళీ ఇలా దర్శనం ఇచ్చింది. అయినా అప్పుడే మెచ్చుకోనివాళ్ళు ఇప్పుడు మాత్రం ఎలా మెచ్చుతారు. ఎంతైనా హీరోయిన్లది మేకప్ అని తెలిసినా ఆ రూపం లోనే చూడటానికి ఇష్టపడతారు జనం.... ఒరిజినల్ ఎవడిక్కావాలీ...

English summary
Actress Kajal Agarwal’s without make up photos making hulchul on social media. Have a look at Kajal Agarwal photo without makeup.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu