»   »  ప్రెగ్నెన్సీపై కాజల్ క్లారిటీ.. ఆయనతో ప్రేమ ఇంకా కొనసాగాలి..

ప్రెగ్నెన్సీపై కాజల్ క్లారిటీ.. ఆయనతో ప్రేమ ఇంకా కొనసాగాలి..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kajal Aggarwal gives clarity over pregnancy ప్రెగ్నెన్సీపై కాజల్ క్లారిటీ

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కాజల్ అగర్వాల్ దూసుకెళ్లున్నది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తన 50వ చిత్రాన్ని పూర్తి చేసుకొన్నది. తమిళంలో అజిత్‌తో నటించిన వివేకం చిత్రం విజయఢంకా మోగిస్తున్నది. అలాగే నేనే రాజు నేనే రాజు మంత్రి సినిమా తమిళంలో నాన్ అన్నైయిత్తాల్ చిత్రం సెప్టెంబర్ 22న విడుదలకు సిద్ధమవుతున్నది. ఇలా దూసుకెళ్తున్న కాజల్‌కు ప్రెగ్నేన్సీ రావడం ఏంటా అని కంగారు పడుతున్నారా? ఇటీవల మీడియాలో వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లకు సమాధానం ఇచ్చింది. అసలు విషయమేమింటంటే..

గర్భం దాల్చిన నిషా అగర్వాల్

గర్భం దాల్చిన నిషా అగర్వాల్

కాజల్ సోదరి నిషా అగర్వాల్‌కు కరణ్‌దార్‌తో వివాహం అయింది. ప్రస్తుతం నిషా గర్భవతి. తన సోదరి మాతృత్వానికి దగ్గరైనందున్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

చాలా ఆనందంగా..

జీవితంలో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను పెద్దమ్మను కాబోతున్నాను. నిషా ప్రసవానికి కౌంట్ మొదలైంది. మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతున్నది అని ఓ పోస్ట్‌లో పేర్కొన్నది.

జోగేంద్రతో ప్రేమ

అలాగే తమిళంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. జోగేంద్రతో ప్రేమ అలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను అని తమిళ వెర్షన్ విజయంపై ఆశాభావాన్ని కాజల్ వ్యక్తం చేశారు. రానా సరసన రాధా అనే పాత్రలో కాజల్ నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

మెర్సల్‌లో విజయ్ సరసన

మెర్సల్‌లో విజయ్ సరసన

ఇక తమిళంలో విజయ్ సరసన మెర్సల్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో సమంత, నిత్యమీనన్ హీరోయిన్లు. ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దీపావళీ కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ కానున్నది.

English summary
Actress Kajal Aggarwal gives clarity on her sister Nisha Aggarwal's pregnancy. Nisha is now pregnant. she going to blessed with baby anytime. This news shared by Kajal in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu