»   »  పెళ్లి, కాబోయే భర్త గురించి.. పెదవి విప్పిన కాజల్

పెళ్లి, కాబోయే భర్త గురించి.. పెదవి విప్పిన కాజల్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  పెళ్ళి గురించి పెదవి విప్పిన కాజల్

  ఈతరం హీరోయిన్లలో 50 చిత్రాలు పూర్తి చేసిన ముద్దుగుమ్మగా కాజల్ అగర్వాల్ ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ చిత్రాలతో ప్రస్తుతం కాజల్ దూసుకెళ్తున్నారు. మల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగిపోవడం వల్ల చిత్ర పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకొంటున్నాయని కాజల్ ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన చిన్నతనంలోని సినిమా అనుభవాలను వెల్లడించారు.

   సినిమా అంటే పిక్‌నిక్‌గా

  సినిమా అంటే పిక్‌నిక్‌గా

  చిన్నతనంలో సినిమా చూడటం అంటే ఓ పిక్‌నిక్ మాదిరిగా ఉండేది. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేవాళ్లం. సినిమా చూడటంతో పాటు సమోసాలు తినడం, కూల్ డ్రింకులు తాగడం లాంటి చేస్తూ బాగా ఎంజాయ్ చేసే వాళ్లం అని కాజల్ అగర్వాల్ అన్నారు.

   మల్టీప్లెక్స్ సంస్కృతి

  మల్టీప్లెక్స్ సంస్కృతి

  ఇప్పుడు పట్టణాలలో మల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగిపోవడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ రాక పెరిగిపోయింది. వినోదంతోపాటు పిల్లలకు, పెద్దలకు కాలక్షేపంగా ఉంటున్నది. ఇప్పటి పిల్లలు కూడా నాలాగే సినిమాను ఎంజాయ్ చేస్తున్నారనే పరిస్థితిని నేను ప్రత్యక్షంగా గమనిస్తున్నాను అని ఆమె అన్నారు.

  భాష గురించి పట్టింపు లేదు

  భాష గురించి పట్టింపు లేదు

  ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. నాకు ఫలానా భాషలో నటించాలనే పరిమితులు లేవు. హాలీవుడ్ గానీ, విదేశీ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే నటించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. నాకు భాష అన్నది ఎప్పుడూ అవరోధం కాలేదు అని కాజల్ చెప్పారు.

   నటనకు స్కోప్ ఉంటే

  నటనకు స్కోప్ ఉంటే

  యాక్టింగ్‌కు స్కోప్ ఉంటే ఏ భాషా చిత్రమైనా నేను నటించడానికి సిద్ధంగా ఉంటాను. అప్పుడు అది ప్రాంతీయ చిత్రమా? బాలీవుడ్ చిత్రమా? విదేశీ చిత్రమా అని నేను చూడను అని కాజల్ వెల్లడించారు.

  కాబోయే భర్త గురించి

  కాబోయే భర్త గురించి

  పెళ్లి, కాబోయే భర్త గురించి కాజల్ తన అభిప్రాయాలను పంచుకొన్నారు. ప్రస్తుతం జీవిత భాగస్వామి గురించి ఆలోచించడం లేదు. సినిమాలతోనే జీవితం సరిపోతున్నది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు అని కాజల్ అన్నారు.

   సమయం వస్తే ఆలోచిస్తా

  సమయం వస్తే ఆలోచిస్తా

  నేను చేసుకోబోయే వ్యక్తి పరిశ్రమకు చెందిన వాడై ఉండాలా? లేదా బయటి వ్యక్తిని చేసుకోవాలా అనే విషయం గురించి ఆలోచించడం లేదు. ఒకవేళ జీవిత భాగస్వామి గురించి ఆలోచించే సమయం వస్తే ఎలాంటి వాడు అనేది నేను చూసుకొంటాను కాజల్ తెలిపారు.

  English summary
  Kajal Aggarwal Speaking about her personal life, Kajal said as of now, she is not thinking about her “Mr. Right”. On whether her Mr.Right will be from within the film industry or outside of it, Kajal said, “I haven’t thought about it; it’s not like I have a very narrow mindset about these things. The person is more important than the industry he belongs to”.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more