»   » త్వరలోనే కాజల్ పెళ్ళి.... వరుడు వివరాలు ఇవే

త్వరలోనే కాజల్ పెళ్ళి.... వరుడు వివరాలు ఇవే

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపు పదేళ్ల నుంచి తెలుగు తెరపై స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది కాజల్‌ అగర్వాల్‌. ఇప్పటికీ ఆమె చేతిలో బోలెడన్ని అవకాశాలున్నాయి. ఇన్నేళ్ల కెరీర్‌లో ఆమె మీద ఒక్క గ్యాసిప్‌ కూడా రాలేదు. అయితే ఇప్పుడు ఆమె గురించి ఓ రూమర్‌ వినిపిస్తోంది. ఆమె ఓ బిజినెస్‌ మ్యాన్‌తో డీప్‌ లవ్‌లో ఉందన్నదే ఆ రూమర్‌. త్వరలో పెళ్లికి కూడా రెడీ అయిపోతోందని వార్తలు బయటకు వస్తున్నాయి.

చాలా మంది హీరోయిన్లలానే కాజల్‌ కూడా ఒక బిజినెస్‌మాన్‌ని సెలక్ట్‌ చేసుకుందట. దేశ వ్యాప్తంగా హోటల్స్‌ వున్న ఒక ప్రముఖ హోటలియర్‌తో కాజల్‌ ప్రేమలో పడిందని, ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నారని వినిపిస్తోంది. అయితే ప్రేమలో పడ్డ సంగతి కానీ, పెళ్లి ఆలోచన చేస్తున్నట్టు కానీ కాజల్‌ ఇంకా చెప్పలేదు. నిజానికి కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ పెళ్ళి జరిగిన కొంత కాలానికే కాజల్ పెళ్ళి జరిగి ఉండాల్సిందట. అయితే అనివార్య కారణాలతో ఆ పెళ్ళి మధ్యలోనే ఆగిపోయింది.

 Kajal Aggarwal Marriage Confirmed ?

మేటర్ ఏంటంటే గత మూడు సంవత్సరాలుగా కాజల్ అగర్వాల్ సీరియస్ లవ్ లో ఉంది. కాజల్ లవర్ ముంబాయ్ కు చెందిన గ్రేట్ బిజినెస్ మెన్. జ్యూయలరీ అండ్ డైమండ్స్ కు సంబంధించిన బిజినెస్ లను కాజల్ కాబోయే భర్తే చూసుకుంటున్నాడు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అథనికి చైన్ హొటళ్ళు కూడా ఉన్నాయని వినికిడి. అయితే నిషా అగర్వాల్ పెళ్ళి సమయంలో ఈ అక్క చెల్లల్లు పెళ్ళి చేసుకోవాల్సి ఉండగా, కాజల్ మాత్రం మరో రెండు సంవత్సరాలు అగుతానంటూ పేరేంట్స్ ను ఒప్పించిది. నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని కాజల్ సోషల్ మీడియాలో చెప్పింది కూడా ఇతని గురించే అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.

గత ఏడాది వరుస పరాజయాలతో తన కెరియర్‌ ఖతం అయిపోయిందేమో అనిపించిన కాజల్‌ ఈ ఏడాదిని బ్లాక్‌బస్టర్‌ ఖైదీ నంబర్‌ 150తో మొదలుపెట్టింది. తండ్రీ కొడుకులతో అదిరిపోయే విజయాలని అందుకున్న ఘనత కాజల్‌కే దక్కింది. ఖైదీ ఇచ్చిన బూస్ట్‌తో మళ్లీ కాజల్‌ కోసం ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

English summary
Kajal Aggarwal has finally opened up about her marriage recently in an interview. In the past, there were several rumors that Kajal will also settle down post her sister marriage but she constantly postponed her marriage but now here comes the final and official confirmation on her marriage from her itself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu