»   » కాళహస్తిలో కాజల్ (పూజ ఫోటోలు)

కాళహస్తిలో కాజల్ (పూజ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన బిజీ షెడ్యూల్ కాస్త ఖాళీ చేసుకుని కాళహస్తిలోని శ్రీ కాళహస్తేశ్వర దేవాలయానికి విచ్చేసారు. ఆమెతో పాటు ఆమె కుటుంబం నుంచి తండ్రి,తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. అక్కడ ఆమె రాహు,కేతు గ్రహ పూజలు జరిపారు.

ఆమె నిన్న ఈ పూజలు జరపటానికి కాళహస్తి వచ్చారు. అక్కడ ఆమె భగవంతుడుకి కొబ్బరికాయ,పుష్పాలు సమర్పించి ప్రసాదం తీసుకున్నారు. ఆ తర్వాత స్వామి దర్శనం చేసుకుని వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె అక్కడికి రావటంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది.

తమ అభిమాన హీరోయిన్ రావటంతో దేవాలయానికి వచ్చిన చాలా మంది భక్తుల దృష్టి ఆమెమీదే పడి కొంత సేపు గందళగోళం ఏర్పడింది. చాలా మంది ఆమె వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ లు తీసుకోవాలని ముచ్చట పడ్డారు. ఆమె నవ్వుతూ చేతులు ఊపింది. అయితే గుడి ప్రాగణంలో ఆటోగ్రాఫులు ఇవ్వనని స్పష్టంగా తెలియచేసింది. అయితే కాస్సేపట్లో దేవాలయ అధికారులు కల్పించుకోవటంతో అంతా సర్ధుమణిగింది.

గత కొంత కాలంగా...కాజల్ తెలుగు సినిమాను ఊపేసిందనే చెప్పాలి. అయితే 2013 సంవత్సరం ఆమెకు ఊపు ఇవ్వలేదు. 'బాద్‌షా' తర్వాత తెలుగులో అస్సలు కనిపించలేదు. చాలా మంది దర్శకనిర్మాతలు వెంటపడినా... నో చెప్పింది. రెమ్యునేషన్ విషయంలో అసంతృప్తితోనే తెలుగుకి దూరమైందని ప్రచారం సాగుతోంది. కాజల్‌ మాత్రం ఇప్పటికీ తెలుగులో కథలు వింటూనే ఉన్నా అని చెబుతోంది. ఈ యేడాది 'నాయక్‌', 'బాద్‌షా' చిత్రాలతో సక్సెస్ లు అందుకొంది. 'ఎవడు'లో అతిథి పాత్ర చేసింది. తమిళంలో రెండు సినిమాలు చేసింది.

పూజ విశేషాలు ..ఫోటోలతో స్లైడ్ షో లో...

భక్తితో భగవంతుడుకి పూజ చేస్తూ...

భక్తితో భగవంతుడుకి పూజ చేస్తూ...

తల్లి,తండ్రితో కలిసి వచ్చిన ఆమె పూజ జరుగుతున్నంతసేపు వేరే దృష్టి లేకుండా నిమగ్నమైంది. శ్రీ కాళ హస్తేర్వరుడు అర్చనలో ఆమె చాలా సేపు గడిపింది. ఇక్కడ ఆమె చాలా ప్రశాంతత,ఆనందం ఫీలయినట్లు ఆమె సన్నిహితులు తెలియచేసారు.

తండ్రితో కలిసి..

తండ్రితో కలిసి..

కాజల్ తన తండ్రి వినయ్ అగర్వాల్ తో కలిసి ఈ దేవాలయానికి వచ్చారు. ఆయనో వ్యాపార వేత్త. పూజ అనంతరం చాలా సేపు ఆమె తండ్రితో మాట్లాడుతూ కనిపించింది. తన ముద్దుల కూతురుకి ఆయన విగ్రహాలు చూపెడుతూ విశేషాలు చెప్పారు.

తల్లితో కాజల్..

తల్లితో కాజల్..

కాజల్ కి తల్లి దగ్గర బాగా చనువు. ఆమె తల్లి సమన్ అగర్వాల్ కూతురు చేత చాలా శ్రద్దగా ఈ పూజను నిర్వహింపచేసింది. కుమార్తె పూజ అనంతరం తల్లి,తండ్రులతో కలిసి ఆమె దైవ దర్శనం చేసారు.

కొబ్బరి కాయలు కొడుతూ...

కొబ్బరి కాయలు కొడుతూ...

పూజలో భాగంగా ఆమె కొబ్బరికాయలను కొట్టి భగవంతుడుకి అర్పించింది. తల్లి,తండ్రి కూడా తర్వాత కొబ్బరి కాయలు కొట్టి,పూలు సమర్ఫించారు.

తీర్ధ ప్రసాదాలు తీసుకుంటూ...

తీర్ధ ప్రసాదాలు తీసుకుంటూ...

పూజ అనంతరం శ్రీ కాళహస్తేరయ స్వామిని దర్శించుకుని తండ్రి వినయ్ తో కలిసి ఆమె తీర్ధ ప్రసాదాలు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె దృష్టి పూర్తిగా దైవం పై నిమగ్నం చేసారు.

అందుకే గ్యాప్

అందుకే గ్యాప్

రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నాను..దీంతో పాటు చెల్లి పెల్లి . ఈ కారణాల వల్లే తెలుగులో గ్యాప్ వచ్చింది. త్వరలో రెగ్యులర్ గా కృష్ణవంశీ-చరణ్ లో సినిమా షూటింగ్ లో పాల్గొంటా. చందమామ తర్వాత మళ్లీ కృష్ణ వంశీ గారితో చేయటం చాలా హ్యాపీ. ఇందులో నాది చాలా మంచి రోల్. చరణ్ తో నేను చేసిన మగధీర, నాయక్,ఎవడు పెద్ద హిట్. ఇది కూడా ఖచ్చితంగా హిట్ అంది.

రామ్ చరణ్ తో...

రామ్ చరణ్ తో...

కాజల్ ఇప్పుడు రామ్ చరణ్ సరసన కృష్ణ వంశీ దర్శకత్వంలో చిత్రం కమిటైంది. ఈ చిత్రంలో ఆమె చాలా సంప్రదాయంగా ఉండే అమ్మాయిగా కనిపించనుందని తెలుస్తోంది. శ్రీకాంత్ సైతం కీలకపాత్రను పోషిస్తున్న ఈ చిత్రంతో ఆమె తన కెరీర్ పీక్స్ కి వెళ్తుందని భావిస్తోంది.

రూమర్ అంతే...

రూమర్ అంతే...

"పారితోషికం సమస్య వల్ల తెలుగులో గ్యాప్ తీసుకున్నాననేది కేవలం రూమర్. పారితోషికం అనేది నాకెప్పుడూ సమస్య కాలేదు. నా పారితోషికంతో నిర్మాతలెవరూ ఇబ్బంది పడలేదు. అలా అయితే నేను తమిళంలో బిజీగా ఉండేదాన్ని కాదు కదా. తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం'' అని చెప్పింది కాజల్ అగర్వాల్.

తమిళంలోనూ...

తమిళంలోనూ...

తెలుగులో రామ్ చరణ్ సరసన సినిమా ఓకే చేసిన ఆమె తమిళంలో వరుస అవకాశాలు అందిపుచ్చుకొంటోంది. యువ నటుడు ధనుష్‌, కలువకళ్ల భామ కాజల్‌ అగర్వాల్‌ తొలిసారిగా జంట కట్టనున్నారు. తెలుగులో అగ్రస్థానంలో ఉన్న కాజల్‌ సమయం దొరికినప్పుడల్లా తమిళంలో నటిస్తోంది. కార్తీకి జంటగా 'నాన్‌మహాన్‌ అల్ల'తో హిట్టు అందుకున్న ఈ భామ... ఆపై సూర్యతో 'మాట్రాన్‌'లో నటించింది. మధ్యలో విజయ్‌తో 'తుపాకీ' రూపంలో బ్లాక్‌బస్టర్‌ అందుకుని పొంగల్‌ కానుకగా విడుదలైన 'జిల్లా'లోనూ కనువిందు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కుర్ర హీరో ధనుష్‌తో తొలిసారిగా జంట చేరనుంది.

కాంబినేషన్ క్లిక్ అవుతుంది...

కాంబినేషన్ క్లిక్ అవుతుంది...

..రామ్‌చరణ్ కాంబినేషన్‌తో నేను చేసిన సినిమాలన్నీ ఆడాయి. అంటే మా కాంబినేషన్‌ను జనం ఇష్టపడుతున్నారు. అతనితో కలిసి మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ఇప్పుడు మరోసారి చరణ్‌తో కృష్ణవంశీ డైరెక్షన్‌లో చేయబోతున్నా. వచ్చే వారం నుంచే అది సెట్స్ మీదకు వెళ్తోంది. ఇందులో కాస్త రెబల్‌గా ఉండే కేరక్టర్ చేస్తున్నా. అది నాకు బాగా నచ్చింది. అలాగే అది నైస్ ఇంటరెస్టింగ్ స్టోరీ. అందులో భాగం కావడం ఆనందంగా ఉంది అంది.

English summary
Kajal Aggarwal, who is shooting with Ram Charan Teja for director Krishna Vamsi's untitled project, recently took some time from her busy schedule to visit Srikalahastishwara Temple in Kalahasti. Along with her parents and other members of her family, the popular South Indian actress was spotted offering prayers to Rahu and Ketu at the temple.
 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu