»   »  కాజల్‌ అగర్వాల్‌ మనల్ని ప్రేమిస్తోంది..... ఓసారి ఈ పోస్ట్ చూడండి

కాజల్‌ అగర్వాల్‌ మనల్ని ప్రేమిస్తోంది..... ఓసారి ఈ పోస్ట్ చూడండి

Posted By:
Subscribe to Filmibeat Telugu
తేజా తీసిన లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన కాజల్ అగర్వాల్ మొదటి సినిమా సరిగా అడక చాలా రోజులే తెరకి దూరం అయినప్పుడు ఈ రోజు ఇంత రేంజ్ కి ఎగబాకుతానని ఊహించు కూడా ఉండదు. వరుస హిట్ లు ఒక ఎత్తయితే 'మగధీర' రూపంలో కాజల్‌ అగర్వాల్‌కి ఇండస్ట్రీ హిట్‌ అన్న రికార్ద్ ఒక యెత్తై కాజల్ రేంజ్ ని అమాంతం ఎత్తేసింది..

ఇప్పుడు తాజాగా 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో మరో బంపర్ హిట్, మరో అగ్రహీరోతో జోడీ అన్న క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకుందీ అందాల భామ. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'చందమామ' సినిమా ఆమెకు ఒకప్పుడు బీభత్సమైన బ్రేక్‌ ఇచ్చింది. ఆ సినిమానే లేకపోతే, కాజల్‌ కెరీర్ ఎలా ఉండేదో చెప్పలేం కూడా..

2016లో రెండు బీధారునమైన ఫ్లాపుల్ని చవిచూసిన కాజల్‌, ఇక తెరమీద కనిపించటం తగ్గిపోతుందేమో అనుకుంటున్న సమయం లోనే టైమ్‌లోనే ఆమెకు 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో ఛాన్సొచ్చింది. అంతే, కాజల్‌ కెరీర్‌ మళ్ళీ జోరందుకుంది. తమిళంలోనూ స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కాజల్‌, బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లో నటించింది.

Kajal Aggarwal

బాలీవుడ్‌ సంగతెలా వున్నా, టాలీవుడ్‌ తనకు వెరీ వెరీ స్పెషల్‌ అని చెబుతుంటుంది కాజల్‌ అగర్వాల్‌. కెరీర్‌లో ఫ్లాపులూ, హిట్లూ.. అన్నీ చవిచూసింది కాజల్‌. చిత్రమేంటంటే, కాజల్‌ పనైపోయిందనుకునేలోపే.. ఆమె నుంచి పెద్ద హిట్‌ వచ్చేది. అదే కాజల్‌ అగర్వాల్‌ని పదేళ్ళపాటు హీరోయిన్‌గా కొనసాగేలా చేసింది అప్పుదు చందమామ, ఇప్పుడు కహిదీ కూడా మళ్ళీ అలంటి బ్రేక్ నే తీసుకొచ్చి కాజల్ కెరీర్ గ్రాఫ్ ని మళ్ళీ పైకి లేపింది.

కాజల్ మొదటి సినిమా లక్ష్మీ కళ్యాణం సరిగ్గా ఫిబ్రవరి 15, 2007లో విడుదలైంది ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 తో పదేళ్ళు పూర్తవుతుంది.. లో ఎత్తు పల్లాల్ని చాలానే చూశాననీ, ఈ కెరీర్‌లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌ చెబుతున్నానంటోంది కాజల్‌. చిత్రమేంటంటే తానెదుర్కొన్న 'స్ట్రగుల్స్‌'కే స్పెషల్ థ్యాంక్స్‌ చెప్పిందామె. 'లవ్‌ యూ ఆల్‌..' అంటూ సోషల్‌ మీడియాలో, తన పదేళ్ళ కెరీర్‌ ని గుర్తు చేసుకుంటూ.... అభిమానులందరికీ ఇలా ఐలవ్యూ చెప్పింది..

English summary
"I'd maintain that thnx r d highest form of thot & that gratitude is happiness doubled by wonder.#ThankUMyExtendedFamily #10YrsInFilmIndustry" Kajal Aggarwal posted in Her twitter Wall.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu