»   »  హీరోయిన్ కాజల్ అగర్వాల్ విడాకుల స్టోరీ!

హీరోయిన్ కాజల్ అగర్వాల్ విడాకుల స్టోరీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు ఇంకా పెళ్లి జరిగినట్లు ఎక్కడా వార్తలు విన్నది లేదు...అప్పడే ఈ విడాకుల గోల ఏమిటని అనుకుంటున్నారా? విడాకుల మాట నిజమే కానీ....ఇదంతా రీల్ లైఫ్‌లో జరిగే స్టోరీ. చాలా కాలం తర్వాత హీరోయిన్ కాజల్ ఇటీవల ఓ హిందీ సినిమాకు కమిటైంది.

బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషి ఈచిత్రంలో హీరోయిన్‌గా నటించబోతున్నాడు. ఓ ఇరానియన్ చిత్రానికి రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అజయ్ వర్మ దర్శకత్వం వహించబోతున్న ఈచిత్రం పూర్తి ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోతోంది. ఆసక్తికర కథాంశంతో ఈచిత్రం తెరకెక్కబోతోంది.

Kajal Aggarwal's divorce story

పెళ్లి జరిగి విడాకులు తీసుకున్న ఓ జంట మళ్లీ ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఏ జరిగింది అనేది ఈ చిత్ర కథాంశం. ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఈచిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఒకప్పుడు సౌత్‌లో వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉండే కాజల్ చేతిలో ఇపుడు కొన్ని ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి.

ప్రస్తుతం ఆమె తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు ధనుష్ హీరోగా తెరకెక్కబోతున్న ఓ తమిళ చిత్రానికి కూడా కాజల్ కమిటైనట్లు తెలుస్తోంది.

English summary
Kajal is going to work with Sharman Joshi for the Hindi remake of an Iranian film “Cease Fire”. This film is purely a family drama directed by Ajoy Varma. The story is about a married couple who were on the cusp of a divorce and how they fall in love again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu