»   » అతనితో సంబంధం లేదు.. ఒకరి జీవితంలోకి తొంగి చూడను.. కాజల్

అతనితో సంబంధం లేదు.. ఒకరి జీవితంలోకి తొంగి చూడను.. కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్స్ కేసులో కాజల్ అగర్వాల్ మేనేజర్ అరెస్ట్ కావడం టాలీవుడ్‌లో సంచలనం రేపింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం హైదరాబాద్ మణికొండలో మేనేజర్ పుట్కర్ రాన్సన్ జోసెఫ్ అలియాస్ జానీ జోసెఫ్ అలియాస్ రోనిని అరెస్ట్ చేయడంతో కాజల్ షాక్ తిన్నది. రోని నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. డ్రగ్ మాఫియాను అరికట్టేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా రోని అరెస్ట్ జరిగింది.

 అలాంటి చర్యలను సమర్థించను..

అలాంటి చర్యలను సమర్థించను..

తన మేనేజర్ రోని అరెస్ట్‌ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో స్పందించింది. రోని వ్యవహారంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. రోని అలాంటి చర్యలకు పాల్పడుతాడని ఊహించలేదని, అతని చర్యలను సమర్థించనని ట్విట్టర్‌లో పేర్కొన్నది.

ఆ వార్త విని షాక్ అయ్యాను..

ఆ వార్త విని షాక్ అయ్యాను..

రోని అరెస్ట్ వార్త విని షాక్ తిన్నాను. ఇలాంటి చర్యలకు పాల్పడుతాడని నేను ఊహించలేదు. సమాజానికి కీడు జరిగే ఏలాంటి చర్యలకు కూడా సపోర్ట్ చేయను. నాకు సహాయం అందించే వ్యక్తుల వ్యక్తిగత విషయాలను నియంత్రించలేము. వారు ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో గ్రహించడం కష్టమవుతుంది అని కాజల్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

అన్నీ నా తల్లిదండ్రులే చూసుకొంటారు.

అన్నీ నా తల్లిదండ్రులే చూసుకొంటారు.

నా కెరీర్ గురించి నా తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకొంటారు. సినీ పరిశ్రమలోని వారితో వారే మాట్లాడుతారు. నా వ్యక్తిగత సిబ్బందితో మంచి సంబంధాలు ఉండేలా చూసుకొంటాను. అయితే వారి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే అలవాటు లేదు అని కాజల్ పేర్కొన్నారు.

రవితేజ, ముమైత్‌ను విచారించనున్న సిట్

రవితేజ, ముమైత్‌ను విచారించనున్న సిట్

డ్రగ్ రాకెట్‌కు సంబంధించిన ఇప్పటి వరకు సిట్ అధికారులు దాదాపు 19 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లయర్ కెల్విన్‌తో సంబంధాలు ఉన్న సినీ ప్రముఖులను ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో గతవారం పూరీ జగన్నాథ్‌తోపాటు ఆరుగురు సభ్యులను విచారించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో మొత్తం 12 మంది సెలబ్రిటీలకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. చార్మీని బుధవారం విచారించగా, ఈ వారంలో ముమైత్ ఖాన్, రవితేజ‌ను కూడా విచారించే అవకాశం ఉంది.

English summary
Leading actress Kajal Aggarwal on Tuesday said she was shocked by the arrest of her manager in connection with the drug racket. Her manager Puttkar Ronson Joseph alias Johny Joseph alias Ronnie was arrested from his house in Manikonda here on Monday by the Special Investigation Team (SIT) which is probing the racket.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu