»   » కబడ్డి చిట్టిగా ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కాజల్

కబడ్డి చిట్టిగా ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ రెండు వేరియేషన్స్ వుండే అద్భుతమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారు. కాజల్ కబడ్డీ చిట్టిగా నటిస్తోంది. ఆమె తొలిసారిగా ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రను పోషిస్తోంది. తాప్సీ ఇటీ స్టూడెంట్ గా నటిస్తోంది. పూర్తి కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన చిత్రమిది. రవితేజ కెరీర్ లో 'విక్రమార్కుడు' తర్వాత అంత పవర్ ఫుల్ గా ఇందులో ఆయన పాత్ర వుంటుంది అంటున్నారు దర్సకుడు రమేష్ వర్మ. ఆయన తన తాజా చిత్రం వీర గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రంలో తమిళ నటుడు శ్యామ్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. శ్యామ్ సరసన శ్రీ దేవి నటిస్తోంది. అలాగే నాగబాబు కూడా ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. రాహుల్ దేవ్, ప్రదీప్ రావత్, సుప్రీత్, ప్రభాకర్, ప్రకాష్ రాజ్, చలపతి రావు, రోజా తదితరులు నటిస్తున్నారు బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, హేమ, మాస్టర్ భారత్ తదితరులు పాత్రలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే విధంగా వుంటాయి. ఈ వేసవి కానుకగా మా బ్యానర్ ద్వారా ప్రేక్షకులకు అందించబోతున్న మంచి కానుక 'వీర' చిత్రం అని చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu