For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరో రామ్ తో సహజీవనం పై కాజల్... (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : సినీ స్టార్స్ పై రూమర్స్ వస్తుంటాయి. హీరోయిన్ కాజల్ మీద రకరకాల రూమర్స్ వచ్చాయి. ప్రభాస్ తో ఆమె ఉంటోందని, అలాగే రామ్ తో సహజీవనం చేస్తోందని, అయితే ఎప్పుడూ ఆమె ఆ విషయాలపై పెదవి విప్పలేదు. రూమర్స్ పై మాట్లాడి వాటిని పెద్దది చేసుకోవాల్సిన ఆలోచన లేదు అన్నట్లు ఆమె ముభావంగా ఉండిపోయేది. అయితే తాజాగా ఆమె ఎప్పుడో మర్చిపోయిన విషయమై మాట్లాడింది. ఆమె నటించిన 'సారొచ్చారు' శుక్రవారం విడుదలవుతోంది. ప్రస్తుతం 'నాయక్‌', 'బాద్‌షా' చిత్రాల్లో నటిస్తోంది. ఈ సందర్బంగా మీడియాతో ముచ్చటిస్తూ కాజల్‌ చాలా విషయాలు చెప్పుకొచ్చింది.

  'సారొచ్చారు'లో నా పాత్ర పేరు సంధ్య. పేరు హాయిగా ఉంటుంది కానీ సంధ్యవన్నీ మగరాయుడి వేషాలే. తనని తాను ఓ హీరోలా ఫీలైపోతుంటుంది. మహేష్‌బాబులాంటి హీరోలను అనుకరిస్తుంటుంది. ఈ 'టామ్‌బాయ్' కేరక్టర్‌ను బాగా ఎంజాయ్ చేశాను. రియల్ లైఫ్‌లో మరీ అంతలా కాకపోయినా టామ్‌బాయ్ లక్షణాలు నాలో కొన్ని ఉన్నాయి. ప్రయాణం నేపథ్యంలో సాగే సినిమా ఇది. 'రోడ్ జర్నీ' అన్నమాట. ఈ ప్రయాణంలో హీరోతో ప్రేమలో పడటం, ఆ తర్వాత కథ మలుపు తీసుకోవడం జరుగుతుంది. ఈ చిత్రకథ నాకు బాగా నచ్చింది. మంచి లవ్‌స్టోరి, చక్కని ఫ్యామిలీ సెంటిమెంట్.. ఇలా అన్నీ ఉన్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ బాగా తీశారు అంది.

  రవితేజతో నాకిది మొదటి సినిమా కాదు. తను చాలా ఎనర్జిటిక్. ఈ సినిమాలో మరో నాయికగా రిచా గంగోపాధ్యాయ నటించింది. తన కాంబినేషన్‌లో నాకు సీన్స్ లేవు. ఇందులో నా పాత్ర లెంగ్తీ డైలాగులు చెబుతుంది. అవన్నీ కూడా బట్టీపట్టి లొకేషన్‌లో తడుముకోకుండా చెప్పేశాను. ఈ సినిమాతో నా ఖాతాలో మరో హిట్ ఖాయం అనే నమ్మకం ఉంది. నేను చేసే ప్రతి సినిమా నాకిష్టమే. అందుకే విడుదలకు ముందు ఇలా ఇంటర్వ్యూలు ఇస్తుంటాను. నా సినిమాలో ఉన్న మంచిని నేనే చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు? అందుకే పబ్లిసిటీకి 'నో' చెప్పను అంది.

  లక్ష్మీకల్యాణం'తో నట జీవితానికి శ్రీకారం చుట్టిన ఈ ముంబయి భామ తెలుగునాట పలు విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. ఆమె చెప్పే ముచ్చటైన కబుర్లు...తన కెరీర్ గురించి..జీవితం గురించి.....

  నా గురించి వచ్చిన రూమర్స్ లో నన్ను విపరీతమైన షాక్‌కి గురి చేసింది ఒకటుంది. ‘రామ్‌తో సహజీవనం చేస్తున్నాను' అని ప్రచారం చేశారు. అది విని షాక్ అయిపోయాను. ఇలా కూడా ప్రచారం చేస్తారా? అనిపించింది. 'గణేష్‌' సినిమా సమయంలో రామ్‌తో లింకులు పెడుతూ వార్తలొచ్చాయి. షాక్‌ తిన్నాను.

  ‘నాయక్' చిత్రానికి కోటి ఇరవై లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాను అంటున్నారు.. నిజానికి అంత రెమ్యునరేషన్ నేనెప్పుడు తీసుకోలేదు. అయితే ఇది విన్నాక అంత ఇస్తే బాగుంటుందనిపిస్తోంది

  హీరోల్లో నాగార్జునను బాగా అభిమానిస్తాను. హీరోయిన్స్ లో నయనతార ఇష్టం. ‘శ్రీరామరాజ్యం'లో ఆమె చేసిన సీత పాత్ర నాకెంతోగానో స్ఫూర్తినిచ్చింది. భారతీయ పురాణాలపై నాకు చాలా ఆసక్తివుంది. అవకాశం వస్తే పౌరాణిక పాత్రల్లో నటిస్తాను.

  పెళ్లి విషయమై.... నా మనసుకు నచ్చిన వ్యక్తి ఇప్పటి వరకూ కనబడలేదు. నేను సినిమావాళ్లని పెళ్లి చేసుకోను. ఏ వ్యాపారవేత్తనో వివాహమాడతాను. నాతోపాటు నా కుటుంబాన్ని కూడా ప్రేమగా చూసుకునేవాడు దొరికితే ప్రేమ వివాహం, లేకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్లే.

  ''ఈ నెల 21తో యుగాంతం అంటున్నారు. నేను అస్సలు నమ్మను. మా ఇంట్లో కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. దు. విషయం గురించి ఇటీవల మా అమ్మతో చర్చించాను. మేం అనుకున్నదేంటంటే.. జనాలు చచ్చిపోరు. ఒక యుగం అంతం అయ్యి మరో యుగం ఆరంభం అవుతుందని. ప్రస్తుతం ‘చెడు' పెరిగిపోయింది. ఇటీవల ఢిల్లీలో ఒక అమ్మాయిపై జరిగిన మానభంగం గురించి విని, బాధపడ్డాను. ఇలాంటి చెడంతా నాశనం అయ్యి.. ఒక మంచి యుగం రాబోతోందనుకుంటున్నాను. నేను మరో జన్మ కోరుకోవడంలేదు. మోక్షం కావాలనుకుంటున్నాను''

  ''కథేంటి? అందులో నా పాత్రేంటి? దానికి నేను ఎంతవరకూ న్యాయం చేయగలను? ఇదే నా ప్రణాళిక. నటిగా నా సంపాదన ఎంత? దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి? ఎక్కడ పెట్టుబడిపెడితే అధిక లాభాలు వస్తాయి? ఇలాంటి విషయాల్లో నా తెలివితేటలు శూన్యం. అంతా డాడీయే చూసుకుంటారు.''

  ''నాకు జూన్‌, డిసెంబర్‌ నెలలంటే ఇష్టం. ఎందుకంటే జూన్‌లో నేను పుట్టాను. (నవ్వుతూ) ఇది ప్రపంచానికి దేవుడిచ్చిన గొప్ప వరం. ఈ నెలంతా నేను చాలా సంతోషంగా గడుపుతాను. ఇక డిసెంబరు విషయానికొస్తే నాన్న, అమ్మ, చెల్లి అందరి పుట్టిన రోజులు ఈ నెల్లోనే. సాధారణంగా డిసెంబరులో దేశ విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్కచోట కలుస్తాం.''

  పరిశ్రమలోకి వచ్చాక చాలా విషయాలు నేర్చుకున్నాను. అంతకుముందు నాకు సైక్లింగ్ కూడా తెలియదు. ఇప్పుడు సైక్లింగ్ నేర్చుకున్నాను. అలాగే ‘మగధీర' చిత్రం కోసం గుర్రపుస్వారీ కూడా నేర్చుకున్నాను.

  ''పబ్‌లకు, పార్టీలకు నేను వెళ్లను. నాకు ఆ కల్చర్‌ అలవాటు కూడా లేదు. తీరిక అస్సలు లేదు. ఉదయాన్నే లేవడం... దినపత్రికలు చదవడం, షూటింగ్‌కు సిద్ధం కావడం. మళ్లీ సాయంత్రం వీలైనంత తొందరగా నిద్రపోతాను. వ్యాయామాలు, యోగా ఇవన్నీ సాయంత్రమే. నిద్రపోయే ముందు కాసేపు టీవీలో వార్తలు, విశేషాలు చూస్తాను.''

  దైవభక్తి ఉంది. తిరుపతి వెళతాను. ముంబయ్‌లో ఉంటే సిద్ధివినాయక టెంపుల్, జమ్మూలో వైష్ణోదేవి గుడికి వెళతాను. రాత్రి నిద్రపోయే ముందు కాసేపు కళ్లు మూసుకుని, ప్రార్థన చేస్తాను. దైవారాధన గొప్ప మానసిక శక్తిని అందజేస్తుందని నమ్ముతాను.

  ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా బతకాలన్నది నా కాన్సెప్ట్. నా బతుకు నేను బతుకుతాను.. నీ బతుకు నువ్వు బతుకు.. అనేది నా ఫిలాసఫీ.

  కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉంది. ఈ ఏడాది బాగా బిజీగా సినిమాలు చేశాను. దాంతో ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. అందుకని ఆ విషయంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. క్రమం తప్పకుండా యోగా చేయాలనుకుంటున్నాను. ఆర్థిక వ్యవహారాల గురించి నాకు నాలెడ్జ్ లేదు. డాడీకి బాధ్యత తగ్గించాలనుకుంటున్నాను. అందుకని ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌పై ఇక దృష్టి పెడతా. అలాగే ప్రతి కొత్త ఏడాదికి ఏదో ఒక అడ్వెంచర్ చేయడం నాకిష్టం. గతంలో బంగీ జంప్‌లాంటివి చేశాను. ఈసారి కూడా మరో కొత్త అడ్వెంచర్ చేస్తాను.

  English summary
  Kajal has been part of the films like ‘Brindavanam’, ‘Mr Perfect’ and ‘Veera’ where she had the company of other heroines. ‘Sarocharu’ and ‘Naayak’ will see another heroine apart from Kajal and she is not the one who is complaining. “I never had a problem if my film had two heroines or for that matter three. For me it boils down to my character and the story and if the films turn out to be successful who is complaining? I work hard and put my heart and soul to a film,” informs Kajal.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X