»   » తమన్నా-అల్లు అర్జున్ ల ‘బద్రినాథ్’ పై కాజల్ కెందుకంత టెన్షన్...!?

తమన్నా-అల్లు అర్జున్ ల ‘బద్రినాథ్’ పై కాజల్ కెందుకంత టెన్షన్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బద్రీనాథ్" సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ అందులో హీరోగా నటించిన అల్లు అర్జున్ కీ, దర్శకుడు వినాయక్ కీ, నిర్మాత అల్లు అరవింద్ కీ, ఇంకా చెప్పాలంటే కథానాయిక తమన్నాకీ టెన్షన్ పెరుగుతుంది. ఇది సహజమే... అయితే, ఈ సినిమాతో ఏ విధంగానూ సంబంధం లేని ఓ వ్యక్తికి కూడా టెన్షన్ ఎక్కువవుతోందట. అదెవరంటే... అందాల కాజల్! అవును... ఈ సినిమా గురించి ఎక్కువగా ఎంక్వయిర్ చేస్తున్న వాళ్లలో కాజల్ ముందుందట. కారణం ఏమిటని ఆరా తీస్తే, తమన్నా హీరోయిన్ కావడమే అని తేలింది.

'100% లవ్" సినిమా హిట్ తో మంచి రేంజ్ కి వచ్చిన తమన్నా ప్రస్తుతం కాజల్ కి గట్టి పోటీదారుగా నిలుస్తోంది. భారీ చిత్రంగా రూపొందిన బద్రీనాథ్ కూడా హిట్ అయిపోతే... ఒక్కసారిగా ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయి, ఇక నెంబర్ వన్ స్థానం సునాయాసంగా ఆమె సొంతం అయిపోతుంది. అందుకే, ఆ స్థానానికి ట్రై చేస్తున్న కాజల్ ఈ సినిమా రిజల్ట్ గురించి ఎంతో క్యూరియాజిటీతో ఎదురుచూస్తోందని ఆమె సన్నిహితులు అంటున్నారు. మరి, కాజల్ టెన్షన్ ఇంకా పెరుగుతుందా? లేక టెన్షన్ రిలీవ్ అయ్యేలా రిజల్ట్ ఉంటుందా? అన్నది ఈ నెల 10 న తేలుతుంది. అంతవరకూ అందరికీ టెన్షన్ తప్పదు... కాజల్ కి కూడా..!

English summary
Much talked about Heroines of Telugu Cinema, Tamanna and Kajal Agarwal, Till the happening of ‘Magadheera,’ beautiful Kajal Agarwal was a simple heroine with no star status achieved.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu