»   » నావి ఎవరో మార్ఫింగ్‌ చేశారు: కాజల్

నావి ఎవరో మార్ఫింగ్‌ చేశారు: కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఎవరో మార్ఫింగ్‌ చేశారు. పనీపాటా లేనివాళ్లే టెక్నాలజీని ఈ విధంగా ఉపయోగిస్తుంటారు' అంటూ మండిపడుతోంది కాజల్. ఆమె హాట్‌ హాట్‌ ఫొటోలను ఎవరో ఇంటర్నెట్‌కు ఎక్కించేశారు. ఆ ఫొటోలు చూసినవాళ్లు కాజల్‌ కు ఇంత తెగింపా? అని మాట్లాడుకున్నారు. కానీ ఆ ఫొటోలు నిజంగా కాజల్‌ వి కాదని చెబుతోంది. అలాగే సెల్‌ ఫోన్‌ ద్వారా దొంగచాటుగా ఫొటోలు తీయడాలు, మెయిల్‌ ఐడీలను హ్యాక్‌ చేయడాలు చాలా తప్పని ఆమె చెబుతున్నారు. టెక్నాలిజీ గురించి మాట్లాడుతూ...ఇంటి నుంచి కాలు బయటపెడితే చాలు ఇంట్లోవాళ్లతో సంబంధాలు తెగిపోయేవి. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇంటికి ఎంత దూరంలో ఉన్నా ఎంచక్కా సెల్‌ ఫోన్‌ ద్వారా ఇంట్లోవాళ్లకి టచ్‌ లో ఉండొచ్చు. అంతెందుకు ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఈ చిన్ని ఫోన్‌, ఇంటర్నెట్‌ మనవాళ్లకి మనల్ని దూరం కానివ్వవు. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినందుకు ఆనందించాలో, బాధపడాలో అర్థం కావడంలేదు అంటున్నారు కాజల్‌‌. కాజల్ నటించిన డార్లింగ్ రీసెంట్ గా రిలీజైంది. అలాగే కాజల్ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన బృందావనంలో నటిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu