»   » పాపం కాజల్ చాలా హర్ట్ అయ్యింది

పాపం కాజల్ చాలా హర్ట్ అయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య తాజా చిత్రం దడ ప్లాప్ తో కాజల్ చాలా హర్ట్ అయ్యిందని చెప్తున్నారు. వరసగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో హిట్స్ ఇచ్చి లక్కి హీరోయిన్ అనిపించుకుంటున్న ఆమెకు కెరీర్ లో ఇంత డిజాస్ట్రర్ సినిమా చూడలేదని వాపోతోందిట. అంతేగాక ప్లాప్ ఎలా ఉన్నా తనని కూడా సినిమాలో సరిగ్గా చూపెట్టలేదని కంప్లైంట్ చేస్తోంది. ఆమె డ్రస్ లు, స్టైలింగ్, డబ్బింగ్ అన్నీ చాలా ఇబ్బందిగా ఉండి తన ఇమేజ్ ని దెబ్బతీసాయని బాధ పడుతోంది. అందుకే ఆమె ప్రమేషన్ యాక్టివిటీస్ నుంచి తప్పించుకోవటానికి ప్యారిస్ వెళ్లిపోయిందని తెలుస్తోంది.

ఇక గురువారం విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ శుక్రవారం నాటికే మందగించేసాయి. మార్నింగ్ షో కే డిజాస్టర్ టాక్ రావటం సినిమాకు పెద్ద మైనస్ గా మారింది. మరో ప్రక్కన ఈ చిత్రానికి పోటీగా విడుదలైన కందిరీగ చిత్రం హిట్టవటం, అందులో హన్సికకు పేరు రావటం కూడా కాజల్ కి ఇబ్బంది పెట్టే అంశమంటున్నారు. అందుకే ఇకనుంచి కొత్త దర్శకుల సినిమాలంటే ఆచి తూచి అడుగవెయ్యాలని కాజల్ నిర్ణయించుకుందని తెలుస్తోంది.

English summary
Dada’s failure has left Kajal Agarwal in doldrums due to the criticism that her character is getting. Everything including her makeup, styling, dubbing and performance is being criticized.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu