»   » కాజల్ అగర్వాల్ ఎంత వరకు ఈ ప్రేమ (ఫోటోస్)

కాజల్ అగర్వాల్ ఎంత వరకు ఈ ప్రేమ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

రంగం వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ కవలై వేండాం. ఈ చిత్రాన్ని తెలుగులో ఎంత వరకు ఈ ప్రేమ అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

యామిరుక్క బ‌య‌మేన్‌ ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమా గురించి వివరించారు.

డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ "తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ కావడంతో సినిమా తెలుగు హక్కుల కోసం మంచి పోటీ ఏర్పడింది. అయితే ఫ్యాన్సీ రేటు చెల్లించి తెలుగు హక్కులను సొంతం చేసుకున్నామని తెలిపారు.

ఎంతవరకు ఈ ప్రేమ

ఎంతవరకు ఈ ప్రేమ

`ఎంతవరకు ఈ ప్రేమ` అనే పేరుతో సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళంలో అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వెంకటేష్ తెలిపారు.

బిజినెస్ ఆఫర్స్

బిజినెస్ ఆఫర్స్

`రంగం` చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను కూడా త‌మిళంలో నిర్మిస్తుండ‌టం విశేషం.సినిమాపై ఉన్న అంచ‌నాల‌తో అల్రెడి రెండు ఏరియాల బిజినెస్ కూడా పూర్త‌య్యింది. మిగిలిన ఏరియాస్ కు మంచి బిజినెస్ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. క్రేజీ కాంబినేష‌న్ కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి`` అన్నారు.

నటీనటులు

నటీనటులు

జీవా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే.

English summary
Fans of Kajal Aggarwal, who have not got enough of her in the extremely seducing item song in ‘Janatha Garage,’ are in for a surprising treat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu