For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గోవా బీచ్ లో రిఫ్రెష్ అవుతూ కాజల్...(ప్రెవేట్ ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : టాలీవుడ్ లో నిరంతరం బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరూ అంటే కాజల్ అగర్వాల్ అని చెప్పాలి. ఆమె ఎంత బిజీ అంటే హ్యాలీడేస్ కు తన కుటుంబం తో కూడా గడపలేనంత బిజీ. అయితే ఆమె పని చేస్తున్నప్పుడే రిఫ్రెష్ అవటానికి ప్రయత్నిస్తూంటుంది. తాజాగా ఆమె ఎన్టీఆర్ తో పూరీ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం నిమిత్తం గోవా లో ఉంది. అక్కడ బీచ్ లో ఇలా రిఫ్రెష్ అవుతూ కెమెరాకు చిక్కింది.

  గత కొంతకాలంగా తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు. "మగధీర" చిత్రం భారీ విజయం ఆడించిన తరువాత ఈ భామ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా మారింది. తరువాత "డార్లింగ్","బృందావనం","ఆర్య 2″ వంటి చిత్రాలతో తన స్టార్ ఇమేజ్ ని మరింత పెంచుకుంది. "నాయక్" మరియు 2013 వేసవిలో వచ్చిన "బాద్షా" చిత్రాలు ఆమె క్రేజ్ ని మరింత పెంచాయి.

  రీసెంట్ గా ఆమె ఎన్టీఆర్ సరసన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. అందు నిమిత్తం ఆమె గోవాలో షూటింగ్ లో పాల్గొంది. అక్కడ ఆమె రిఫ్రెష్ అయిన విధానం చూపే ఫొటోలు స్లైడ్ షోలో చూడండి...

  హైలెట్

  హైలెట్

  పూరీ సినిమాల్లో హీరోయిన్స్ కు సమాన ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా లవ్ స్టోరీకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ఈ సినిమాలోనూ అదే జరుగుతోందని ఉత్సాహంగా ఉంది కాజల్.

  ఫేస్ బుక్ లోనూ...

  ఫేస్ బుక్ లోనూ...

  మరో ప్రక్క సోషల్ మీడియాలో కూడా తనదయిన ఆధిపత్యాన్ని ఈ భామ కొనసాగిస్తుంది. ఫేస్ బుక్లో ఈ భామ పేజి కి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరే హీరోయిన్ ఈ సంఖ్యకి దరిదాపుల్లో లేదు. ప్రస్తుతం ఈ భామ తెలుగు మరియు తమిళ చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటుంది.

  రెమ్యునేషన్ గురించి...

  రెమ్యునేషన్ గురించి...

  కాజల్ మాట్లాడుతూ... " పారితోషికం అనేది నాకెప్పుడూ సమస్య కాలేదు. నా పారితోషికంతో నిర్మాతలెవరూ ఇబ్బంది పడలేదు. అలా అయితే నేను తమిళంలో బిజీగా ఉండేదాన్ని కాదు కదా. తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం'' అని చెప్పింది కాజల్ అగర్వాల్.

  పనే ముఖ్యం...

  పనే ముఖ్యం...

  ''పని.. పని.. పని.. జీవితమంతా ఇలాగే ఉంటే ఇక ఆనందం ఎక్కడుంటుంది. అందుకే చిత్రీకరణలో ఎంత బిజీగా ఉన్నా.. ఓ చల్లని సాయంత్రం అలా స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్రాధాన్యమిస్తాను. వాళ్లతో మాట్లాడుకుంటూ.. చల్లని పళ్ల రసం తాగుతూ ఉంటే ఆ ఆనందమే వేరు'' అంటోంది కాజల్‌

  బాలీవుడ్ లోనూ..

  బాలీవుడ్ లోనూ..

  ఆ మధ్యన బాలివుడ్ లో చేతిన తన తొలి చిత్రం "సింగం" విజయం సాదించడంతో తన బాలివుడ్లోకూడా తన ఉనికిని చాటింది. ఇప్పుడు మరో చిత్రంలోనూ ఆమె చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.

  పూరి తో రెండో సారి..

  పూరి తో రెండో సారి..

  గతంలో పూరి దర్శకత్వంలో ఆమె బిజినెస్ మ్యాన్ చిత్రం చేసింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. మళ్లీ రెండో సారి ఇలా...షూటింగ్ లో పాల్గొంటోది. పూరి కు ఆమె కు మధ్య మంచి ర్యాపో ఉంది. షూటింగ్ లొకేషన్ లోదీ ఫొటో.

  నిర్మాతతోనూ ...

  నిర్మాతతోనూ ...

  కాజల్ ఇంతకుముందు నటించిన ...గోవిందుడు అందరి వాడేలే, బాద్షా చిత్రాలు బండ్లగణేష్ నిర్మించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆమె ఇదే నిర్మాతతో చేస్తోంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ గెటప్ ఇదే.

  ఎన్టీఆర్ పార్టీ ఇచ్చాడు

  ఎన్టీఆర్ పార్టీ ఇచ్చాడు

  ఎన్టీఆర్ తో గతంలో ఆమె బాద్షా చిత్రం చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ తో చేయటంతో అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఎన్టీఆర్ గోవాలో పార్టీ ఇచ్చాడు. అప్పుడుదీ ఫొటో.

  English summary
  Kajal Aggarwal busy with shoot of NTR movie in Goa and she found some time to cool her heels at famous Goa beach
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X