»   » 'మగధీర' పాత్ర ప్రభావం నాపై ఎంతంటే...కాజల్

'మగధీర' పాత్ర ప్రభావం నాపై ఎంతంటే...కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మగధీర' నా సినీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. అలాగే నా ఆలోచన సరళినీ, జీవన శైలినీ కూడా మార్చింది. ప్రతి విషయాన్నీ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాను. ఇంతకు ముందు ప్రతి చిన్న విషయానికీ కోపం వచ్చేసేది. ఇప్పుడు చాలా వరకూ తగ్గించుకున్నాను. సహనాన్ని అలవరచుకున్నాను. మంచి ఫలితమే వస్తోంద ని చెప్పుకొచ్చింది కాజల్‌. ఆమె 'మగధీర' చిత్రంతో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోయింది‌. ఈ విషయాన్ని ప్రస్దావిస్తూ ఆమె 'కేవలం నా కృషి వల్లే ఇదంతా జరిగిందనుకోను. అదృష్టం కూడా తోడు కావడంతోనే ఎదిగాను" అంటోంది. అలాగే 'మగధీర' తరవాత నేను ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడికి వెళ్లినా మిత్రవిందా అని పిలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అని సంబరపడుతోంది. ప్రస్తుతం కాజల్...ఎన్టీఆర్ సరసన బృందావనం చిత్రంలో చేస్తోంది. ప్రభాస్ తో మున్నా తీసిన వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరో రెండు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X