»   » కేవలం ఎన్టీఆర్ కోసం చేసా, లైఫ్‌లో మళ్లీ చేయను... (ఫోటోస్)

కేవలం ఎన్టీఆర్ కోసం చేసా, లైఫ్‌లో మళ్లీ చేయను... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య హీరోయిన్లకు, ఐటం గర్ల్స్ కి పెద్దగా తేడా లేకుండా పోయింది. స్టార్ హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగుల పేరుతో ఐటం నెంబర్స్ చేస్తున్నారు. బాలీవుడ్లో మొదలైన ఈ కల్చర్ మెల్లిమెల్లిగా సౌత్ సినిమాలకు పాకింది.

ఐటం గర్ల్స్ చేస్తే మామూలుగా పారితోషికం ఇచ్చే నిర్మాతలు... అదే సాంగ్ హీరోయిన్లు చేస్తే ఎంత డబ్బైన గుమ్మరించడానికి వెనుకాడటం లేదు. ఇటీవల విడుదలైన 'జనతా గ్యారేజ్' సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.


అసలు సినిమాలో ఐటం సాంగ్ అవసరం లేక పోయినా... కేవలం నిర్మాతల మాట కాదనలేక మీ ఇష్టమైన హీరోయిన్ ను పెట్టుకోండి అనేసాడట దర్శకుడు కొరటాల శివ. ఇంకే... భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి కాజల్ ను తీసుకొచ్చారు నిర్మాతలు. ఆమెతో చేయించిన పక్కా లోకల్ ఐటం సాంగుకు మంచి స్పందనే వచ్చింది. మాస్ ఆడియన్స్ కు బాగాకనెక్ట్ అయింది.


 లైఫ్ లో చేయనంటోందట

లైఫ్ లో చేయనంటోందట


జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కాజల్ కు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. సౌత్ లో ముఖ్యంగా తమిళంలో చాలా ఆఫర్స్ వస్తున్నాయట. అయితే ఆమె మాత్రం అలాంటివి తాను ఇకపై చేయబోవడం లేదని తేల్చి చెబుతోందట. ఐటం గర్ల్ గా మిగిలిపోతాననే భయం

ఐటం గర్ల్ గా మిగిలిపోతాననే భయం


కాజల్ కెరీర్ అసలే బాగోలేదు. అవకాశాలు కూడా తక్కువే. ఇలా తాను వరుసగా ఐటం సాంగులు చేసుకుంటూ పోతే తనకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయి ఐటం గర్ల్ గా మిగిలిపోతాననే భయంతోనే ఈ నిర్ణయం తీసుకుందట. కోటి ఇచ్చినా ససేమిరా..

కోటి ఇచ్చినా ససేమిరా..


ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా ఇక ఐటెం సాంగ్ చేసేది లేదని ఈ అమ్మడు చెప్పడంతో కొందరు కోటి సైతం ఇవ్వడానికి సిద్ధమయ్యారట. అయినా కాజల్ తన నిర్ణయం మీదే గట్టిగా నిలబడి ఉందని తెలుస్తోంది. కేవలం ఎన్టీఆర్ కోసమే

కేవలం ఎన్టీఆర్ కోసమే


ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం వల్లే జనతా గ్యారేజ్‌లో స్పెషల్ సాంగ్‌కి ఒప్పుకుందట కాజల్. ఇకపై తన లైఫ్ లో ఐటం సాంగులు చేయకూడదని నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం చిరుతో

ప్రస్తుతం చిరుతో


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
English summary
Kajal Aggarwal Says No To Item Songs. After the huge success of "Pakka Local", item number offers have flooded in for her from Tollywood and Kollywood. But Kajal agarwal is not interested.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu