»   » డైరక్టర్ కి చాలా టాలెంట్ ఉంటే తప్ప చేయనంటున్న కాజల్

డైరక్టర్ కి చాలా టాలెంట్ ఉంటే తప్ప చేయనంటున్న కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం నాకు అభ్యంతరం లేదు. అలాగే నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు చేయడానికి కూడా వెనుకాడను. కాకపోతే... అలాంటి పాత్రలు ఒప్పుకునే ముందు దర్శకుడి గురించి మాత్రం ఆలోచిస్తాను. ఒక హీరోయిన్‌ని నెగటివ్ టచ్ ‌లో చూపించాలంటే దర్శకుడికి చాలా టాలెంట్ కావాలి. అలాంటి దర్శకుడు అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను అంటోంది కాజల్ అగర్వాల్. అలాగే హిందీ సినిమాలకు అవకాశం వస్తే చేస్తారా? అని అడిగితే తప్పకుండా చేస్తాను. ఎందుకంటే హిందీ నాకు బాగా వచ్చు. అందుకని ఆ భాషలో నటించడం నాకు చాలా సులువు అని చెప్పారు. ప్రస్తుతం కాజల్...నాగచైతన్య సరసన అజయ్ భుయాన్ చిత్రంల చేస్తోంది.అలాగే రామ్ చరణ్ మెరుపు నుంచి డేట్స్ లేవని తప్పుకుంది. అలాగే ఎన్టీఆర్, సురేంద్ర రెడ్డి చిత్రం రచ్చలో ఆమె బుక్కయింది. అలాగే ప్రభాస్ సరసన దశరధ్ దర్శకత్వంలో మిస్టర్ ఫెరఫెక్ట్ లోనూ చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu