»   »  వివాహమై అప్పుడే 18 ఏండ్లు.. ఇదిగో మా సెల్ఫీ .. విష్ మీ..

వివాహమై అప్పుడే 18 ఏండ్లు.. ఇదిగో మా సెల్ఫీ .. విష్ మీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో ప్రముఖ తారలు కాజోల్, అజయ్ దేవగన్ దంపతుల వివాహం జరిగి ఫిబ్రవరి 24 తేదీకి 18 ఏండ్లు నిండాయి. ఈ సందర్భంగా వారిద్దరూ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ సంతోష క్షణాలను అభిమానులతో పంచుకొన్నారు.

 తనూజ కూతురిగా పరిశ్రమలోకి

తనూజ కూతురిగా పరిశ్రమలోకి


ప్రముఖ నటి తనూజ కూతురిగా 1992లో బేఖుదీ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కాజోల్ తన కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను చేజిక్కించుకున్నది. బాజీగర్ చిత్రంతో లక్షలాది మంది అభిమానుల హృదయాలను దోచుకున్నది.

 ప్రారంభంలోనే సంచలన విజయాలు

ప్రారంభంలోనే సంచలన విజయాలు


యే దిల్లగి, దిల్ వాలే దుల్హనియా లేజాయంగే, గుప్త్, ప్యార్ తో హోనా హీ తా, కుచ్ కుచ్ హోతా హై, హమ్ ఆప్కే హై కౌన్, కబీ ఖుషీ కబీ ఘమ్, ఫనా, మై నేమ్ ఈజ్ ఖాన్, దిల్ వాలే లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

 1999 ఫిబ్రవరి 24న అజయ్‌తో వివాహం

1999 ఫిబ్రవరి 24న అజయ్‌తో వివాహం


కెరీర్ ఉన్నత స్థాయిలో ఉండగానే అభిమానులను షాక్‌కు గురిచేస్తూ 1999 ఫిబ్రవరి 24న ప్రముఖ నటుడు అజయ్ దేవగన్‌ను వివాహం చేసుకొన్నది. ప్రస్తుతం ఈ స్టార్ దంపతులకు నైసా, యుగ్ ఇద్దరు సంతానం.

 18వ వివాహా వార్షికోత్సవం..

18వ వివాహా వార్షికోత్సవం..


తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పెద్ద ఎత్తున అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. వారిని అభినందించారు. ఈ సందర్భంగా ‘మాపై అభినందనలు కురిపించిన మీ అందరికీ థ్యాంక్యూ' అంటూ కాజోల్ ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

English summary
Kajol, Ajay Devgn celebrate 18 years of togetherness and marital bliss. Fans of the actress flooded her social media feed with wishes, congratulating them on their 18th marriage anniversary
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu