»   » ధనుష్ కు ప్రతినాయిక కష్టాలు.. వీఐపీ2 లో విలన్ గా బాలీవుడ్ అగ్రనటి

ధనుష్ కు ప్రతినాయిక కష్టాలు.. వీఐపీ2 లో విలన్ గా బాలీవుడ్ అగ్రనటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

వీఐపీ2లో బాలీవుడ్ అగ్రనటి నటిస్తున్నదని కొద్దిరోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు తెరపడింది. ధనుష్ కు పోటీగా ప్రతినాయిక పాత్రలో బాలీవుడ్ నటి కాజోల్ నటిస్తున్నదని చిత్ర దర్శకురాలు, రజనీకాంత్ కూతురు సౌందర్య తెలిపారు. వారం రోజులపాటు జరిగే షూటింగ్ కోసం కాజోల్ చిత్రం బృందంతో చేరింది.

Kajol as Villain in VIP 2

ఈ సందర్భంగా సౌందర్య మీడియాతో మాట్లాడుతూ.. ధనుష్ ను ఢీకొట్టే వ్యాపారవేత్త పాత్రలో కాజోల్ నటిస్తున్నారు. అంతమాత్రన పూర్తిగా విలన్ గా భావించకూడదు. కాజోల్ తన నటనతో అభిమానులకు కొత్త అనుభూతిని కలిగిస్తారు అని అన్నారు. ఆమె పాత్రలో విభిన్నమైన కోణాలున్నాయని పేర్కొన్నారు. తమిళ చిత్రంలో కాజోల్ నటించడం ఇది తొలిసారి కాదు.

Kajol as Villain in VIP 2

1997లో మిన్సారా కనవు (మెరుపు కలలు) చిత్రంలో అరవింద్ స్వామి, ప్రభుదేవా సరసన నటించారు. వీఐపీ చిత్రంలో పాల్గొన్న తర్వాత కాజోల్ మాట్లాడుతూ మళ్లీ తమిళ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. గత నెల తమిళ సూపర్ స్టార్ రజనీ చేతుల మీదుగా చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కాజోల్ తో ఉన్న మోషన్ పోస్టర్ ను ధనుష్ ట్వీట్ చేశారు.

English summary
Bollywood star Kajol Joins VIP 2 Team
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu